News June 23, 2024
ప్రియుడిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది బంధువులు, మిత్రుల సమక్షంలో వీరి వివాహం ముంబైలో ఘనంగా జరిగింది. వెడ్డింగ్ ఫొటోలను సోనాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పెళ్లి సమయంలో ఆమె తెలుపురంగు ‘చికంకారి’ ఎంబ్రాయిడరీ చీర ధరించారు. కాగా ఏడేళ్లుగా జహీర్, సోనాక్షి ప్రేమలో ఉన్నారు.
Similar News
News January 26, 2026
తక్కువ పంట కాలం, అధిక ఆదాయం.. బీర పంటతో సొంతం

సీజన్‌తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. పైగా మార్కెట్‌లో దీనికి డిమాండ్ ఎక్కువ. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీర పంట సాగు, అధిక ఆదాయం రావడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 26, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<
News January 26, 2026
ఇంటింటికీ ‘Prestige’.. ఫౌండర్‌కు పద్మశ్రీ

వంటింట్లో ఉండే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. అలాంటి ప్రెషర్ కుక్కర్‌ను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత టీటీకే ప్రెస్టీజ్ గ్రూప్ అధినేత జగన్నాథానికి దక్కుతుంది. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం మరణానంతరం పద్మశ్రీతో గౌరవించింది. ప్రెషర్ కుక్కర్స్‌లో సేఫ్టీ మెకానిజాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రెస్టీజ్‌కు బ్రాండ్‌ను క్రియేట్ చేసి ‘కిచెన్ మొఘల్’ అయ్యారు.


