News June 24, 2024
T20WC: పడి లేచిన కెరటం ఇంగ్లండ్..!
టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జర్నీ పడుతూ లేస్తూ కొనసాగుతోంది. లీగ్ స్టేజీలోనే దాదాపు ఎలిమినేట్ అయ్యే దశకు ఆ జట్టు చేరుకుంది. మరో 15 నిమిషాలు వర్షం కురిసుంటే ఇంగ్లండ్ అప్పుడే టోర్నీ నుంచి నిష్క్రమించేది. చివరకు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నమీబియాపై గెలిచింది. సూపర్-8కు చివరగా అర్హత సాధించింది ఇంగ్లండ్ జట్టే. అలాగే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టు కూడా ఇదే.
Similar News
News January 3, 2025
సిరియా మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం?
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ప్రస్తుతం రష్యాలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆయన తీవ్రంగా జబ్బు పడ్డారని, భద్రతాసిబ్బంది అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. విషప్రయోగం జరిగినట్లు వైద్యులు గుర్తించారని పేర్కొన్నాయి. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించాయి.
News January 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 3, 2025
జనవరి 3: చరిత్రలో ఈరోజు
1831: సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జననం
1903: సంస్కృతాంధ్ర పండితుడు నిడుదవోలు వేంకటరావు జననం
1925: నటుడు రాజనాల కాళేశ్వరరావు జననం
1934: రచయిత వీటూరి సత్య సూర్యనారాయణ మూర్తి జననం
1940: తెలుగు సినీ దర్శకుడు కట్టా సుబ్బారావు జననం
2002: ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ మరణం
* జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం