News June 24, 2024
విశాఖ: రూ.1.19 కోట్ల పన్ను వసూలు చేసిన రవాణా శాఖ

బీహెచ్ సీరీస్ వాహనాల కొనుగోలు ద్వారా పన్ను ఎగ్గొట్టే వారిపై రవాణా శాఖ అధికారులు ఉక్కు పాదం మోపారు. 56 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.1.19 కోట్ల పన్నులు వసూలు చేసినట్లు జిల్లా ఉపరవాణా కమిషనర్ రాజా రత్నం తెలిపారు. వారి నుంచి అపరాధ రుసుం రూ.10 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వాహనాలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టి వాహనదారులపై కేసులు కూడా నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News October 27, 2025
తుఫాన్ పరిస్థితులపై విశాఖ ప్రత్యేక అధికారి అజయ్ జైన్ సమీక్ష

విశాఖ జిల్లాలో తుఫాను పరిస్థితిని ప్రత్యేకాధికారి, స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ పర్యవేక్షించారు. సోమవారం ఉదయం కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీలతో భేటీ అనంతరం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. కొండవాలు ప్రాంతాల్లోని ప్రజలను స్థానిక అధికారుల ద్వారా అప్రమత్తం చేయాలని సూచించారు. జేసీబీలు, జనరేటర్లు, కటింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
News October 27, 2025
విశాఖలో పలుచోట్ల నేలకొరుగుతున్న చెట్లు

మొంథా తుపాన్ నేపథ్యంలో వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా ఇస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రామాటాకీస్, కైలాసపురం ఎన్జీవో కాలనీ, రైల్వే క్వార్టర్స్, కంచరపాలెం తదితర ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. అడపా దడపా భారీ వర్షం కూడా కురుస్తోంది. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది.
News October 27, 2025
విశాఖ: మొంథా తుఫాన్.. జాగ్రత్తగా ఉండండి

తుఫాన్ నేపథ్యంలో విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పెను గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 0891- 2590102, 0891- 2590100 ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాలు నిషేధించారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు ప్రకటించారు.


