News June 24, 2024
KCRతో గంగుల భేటీ.. పార్టీ మార్పు ప్రచారానికి చెక్?
TG: కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్న వేళ కీలక పరిణామం జరిగింది. నిన్న KCRతో గంగుల, 29 మంది కార్పొరేటర్లు భేటీ అయ్యారు. కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న కమలాకర్ BRSను వీడితే పార్టీకి నష్టమని భావించి కేసీఆరే.. ఆయన్ను ఫామ్‌హౌస్‌కు ఆహ్వానించినట్లు సమాచారం. భవిష్యత్ అంతా BRSదేనని, ఎవరూ పార్టీ మారొద్దని గులాబీ దళపతి సూచించినట్లు తెలుస్తోంది.
Similar News
News January 10, 2025
జై షాకు బీసీసీఐ సన్మానం
ఐసీసీ నూతన ఛైర్మన్ జై షాను సన్మానించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఆదివారం ముంబైలో జరిగే ప్రత్యేక సమావేశం అనంతరం షాకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాయి. షా ప్రస్తుతం బీసీసీఐలో ఏ హోదాలోనూ లేనప్పటికీ ఆయన్ను ప్రత్యేక అతిథిగా సమావేశానికి ఆహ్వానిస్తామని వెల్లడించాయి. బీసీసీఐ కొత్త కార్యదర్శి, కోశాధికారిని ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ఎన్నుకోనున్నారు.
News January 10, 2025
క్షమాపణలు చెబితే సరిపోతుందా?: బొత్స
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ ఘటనకు కచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘భక్తులు భారీగా వస్తారని ముందే తెలిసినా చర్యలు తీసుకోలేదు. డిప్యూటీ సీఎం పవన్ క్షమాపణలు చెబితే సరిపోతుందా? ఈ ఘటనకు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? సామాన్యుల ప్రాణాలంటే సర్కార్‌కు ఇంత నిర్లక్ష్యమా’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News January 10, 2025
ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ
TG: రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు తమ అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్య, నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి, కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లను పార్టీ ప్రకటించింది.