News June 24, 2024
మైపాడు బీచ్‌లో కడప యువకుడు మృతి

కడపకు చెందిన యువకుడు ఇమ్రాన్ నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ కు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కడపలోని ఆటో మెకానిక్ యూసుఫ్ కుమారుడైన ఇమ్రాన్ తన స్నేహితులతో కలిసి ఆటవిడుపు కోసం ఓ వాహనంలో ఆదివారం మైపాడు బీచ్‌కు వెళ్లారు. అక్కడ సరదాగా సముద్రంలో గడుపుతుండగా పెద్ద అల ఇమ్రాన్‌ను తీసుకెళ్లింది. స్థానికుల సహకారంతో ఇమ్రాన్ మృతదేహాన్ని వెలికితీసి కడపకు తీసుకువచ్చారు.
Similar News
News January 7, 2026
మైలవరం: వేరు వేరు చోట ఇద్దరు ఆత్మహత్య

మైలవరం మండలంలో మంగళవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వద్దిరాలలో దేవ (22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అలాగే దొమ్మర నంద్యాలకు చెందిన షేక్ నూర్జహాన్ (20) అనే వివాహిత కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఘటనలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 7, 2026
కడప: మీ నోడల్ అధికారి వీరే.!

ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం కోసం ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారిని నియమించింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
➤ కడప- కమిషనర్ మనోజ్ రెడ్డి
➤ జమ్మలమడుగు- RDO సాయి శ్రీ
➤ ప్రొద్దుటూరు- ZP CEO ఓబులమ్మ
➤ పులివెందుల- PD DRDA రాజ్యలక్ష్మి
➤ మైదుకూరు- డ్వామా PD ఆదిశేషారెడ్డి
➤ బద్వేల్- RDO చంద్రమోహన్
➤ రాజంపేట- సబ్ కలెక్టర్ భావన
➤ కమలాపురం- కడప RDO జాన్ ఇర్విన్.
News January 7, 2026
కడప జిల్లాలో ఉల్లి రైతులకు రూ.28.40 కోట్ల సాయం.!

కడప జిల్లాలో 7298 మంది ఉల్లి రైతులకు 14,203.31 ఎకరాలకు రూ.28.40 కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
*కమలాపురం 2526 మందికి రూ.11.32 కోట్లు
*మైదుకూరు 2352 మందికి రూ.7.74 కోట్లు
*పులివెందుల 1590 మందికి రూ.6.17 కోట్లు
*జమ్మలమడుగు 742 మందికి రూ.2.99 కోట్లు
*బద్వేల్ 67మందికి రూ.14.92 లక్షలు
*రాజంపేట 18మందికి రూ.2.33 లక్షలు
*కడప ఇద్దరికి రూ.35,900
*ప్రొద్దుటూరులో ఒకరికి రూ.20.60 వేలు.


