News June 24, 2024

బాపట్ల: సముద్ర తీరాలకు పర్యాటకుల నిలిపివేత

image

బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీరాలకు పర్యాటకులను అధికారులు నిలిపివేస్తున్నారు. రెండ్రోజుల్లో ఆరుగురు పర్యాటకులు మృతిచెందడం, పలువురు గల్లంతు అయిన నేపథ్యంలో కొన్నిరోజుల పాటు సముద్రతీరాలకు పర్యాటకులను నిలిపివేయాలని బాపట్ల పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే చీరాల, బాపట్ల పరిధిలో ఉన్న తీర ప్రాంతాలకు పర్యాటకులు రావడంతో పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. పర్యాటకులు గల్లంతు కాకుండా చర్యలు చేపట్టారు.

Similar News

News January 3, 2025

గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే: జగన్

image

విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి, బాలికా విద్య ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ‘X’లో ట్వీట్ చేశారు. నేడు ఆమె పోరాటాలను, సేవలను స్మరించుకుంటూ సావిత్రిబాయి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.

News January 3, 2025

పేరలి గ్రామ సర్పంచిపై అనర్హత వేటు

image

కర్లపాలెం(M) పేరలి పంచాయతీ సర్పంచ్‌ మల్లెలవెంకటేశ్వర్లుపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు ప్రిన్సిపల్ గుంటూరు డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ఆదేశాలిచ్చింది. పేరలి సర్పంచి ఎన్నికల్లో భాగంగా వెంకటేశ్వర్లు నామినేషన్ ఫారంలో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచాడని, ఆయన ఎన్నిక చెల్లదని వీరయ్య అనే వ్యక్తి కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. విచారించిన కోర్టు ఆయన ఎన్నిక చెల్లదని, సర్పంచ్ పదవికి అనర్హుడని తీర్పునిచ్చింది.

News January 3, 2025

GNT: డాబాపై నుంచి పడి వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు డాబాపై నుంచి వ్యక్తి కిందపడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాగారితోటలో నివాసం ఉండే కొమ్మూరు పకీర్ బుధవారం వీధి కుక్కలు ఇంట్లోకి రావడంతో తరిమే క్రమంలో డాబాపై నుంచి జారిపడ్డాడు. అతణ్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.