News June 24, 2024

కొత్త లుక్‌లో లెజెండ్ శరవణన్

image

తమిళనాడు బిజినెస్‌మెన్ శరవణన్ తన 50వ ఏట ‘ది లెజెండ్’ సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన రెండో సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ దురై సెంథిల్‌కుమార్‌తో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను సెంథిల్ ట్విటర్‌లో పంచుకున్నారు. దీనికోసం శరవణన్ పూర్తిగా తన లుక్‌ను మార్చేశారు. న్యూ లుక్‌లో ఆయన అదిరిపోయారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News December 30, 2025

Fb: ప్రపంచ కుబేరుడు.. అప్పుతో ఇంటి రెంట్ పే

image

ప్రపంచ కుబేరుడు మస్క్ ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్తే 2008లో ఫ్రెండ్స్ అప్పు ఇస్తే రూమ్ రెంట్ పే చేశారు. అప్పట్లో స్పేస్‌ ఎక్స్‌లో భారీ పెట్టుబడి, ఇటు టెస్లా కార్ల సేల్స్ లేక అప్పులే మిగిలాయి. పైగా క్వాలిటీ లేదని భారీగా కార్లు రీకాల్ చేసే పరిస్థితి. మొదటి భార్య విడాకుల సమస్యా అప్పుడే. ఆ పర్సనల్, ప్రొఫెషనల్ టఫ్ టైమ్‌లో మానసికంగా వీక్ అయితే..? కానీ పరిస్థితిని ఎదుర్కొన్నారు కాబట్టే నేడు బిగ్‌గా నిలబడ్డారు.

News December 30, 2025

MOIL లిమిటెడ్ 67 పోస్టులకు నోటిఫికేషన్

image

<>MOIL<<>> లిమిటెడ్ 67 గ్రాడ్యుయేట్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు నేటి నుంచి జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech (మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, మెటలర్జీ), MSC( జియాలజీ), PG(సోషల్ వర్క్), MBA ఉత్తీర్ణులు అర్హులు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, PwBDలకు ఫీజులేదు. https://www.moil.nic.in

News December 30, 2025

ICC ర్యాకింగ్స్‌: టాప్-10లో ముగ్గురు ఇండియన్స్

image

ఐసీసీ తాజాగా విడుదల చేసిన T20I ఉమెన్స్ ర్యాంకింగ్స్‌లో షెఫాలీ వర్మ సత్తా చాటారు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న ఆమె ఏకంగా 4 స్థానాలు ఎగబాకి 736 పాయింట్లతో 6వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. షెఫాలీ సహా టాప్ 10లో టీమ్ ఇండియా నుంచి ముగ్గురు ప్లేయర్స్ ఉండటం విశేషం. తొలిస్థానంలో ఆసీస్ ప్లేయర్ బెత్ మూనీ(794) ఉండగా రెండో స్థానంలో స్మృతి మంధాన(767), పదో స్థానంలో జెమీమా(643) ఉన్నారు.