News June 24, 2024

HYD: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ బదిలీ

image

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్ రాస్‌‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన స్థానంలో గత 2 వారాలుగా GHMCకి ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వ్యవహరించిన ఆమ్రపాలిని నూతన కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రోనాల్డ్ రాస్‌ను విద్యుత్ శాఖ సెక్రటరీగా నియమించారు.
SHARE IT

Similar News

News November 6, 2025

HYD: సజ్జనార్ సార్.. GUN FIRED

image

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇవాళ గన్ ఫైర్ చేశారు. నేరస్థుల గుండెల్లో కాదులెండీ తెలంగాణ పోలీస్ అకాడమీలోని బుల్స్‌ఐపై.. అకాడమీలో జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌కు సిటీ పోలీస్ బృందంతో కలిసి హాజరయ్యారు. ఫైరింగ్‌ రేంజ్‌లో ఉండటం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని, బుల్స్‌ఐ‌ని ఎయిమ్ చేయడం ఎప్పుడూ నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని సీపీ Xలో ట్వీట్ చేశారు.

News November 6, 2025

బోరబండలో బండి సంజయ్ సభకు అనుమతి రద్దు!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బండి సంజయ్ సభకు అనుమతి రద్దయ్యింది. సా. బోరబండలో మీటింగ్ జరగాల్సి ఉంది. సభకు అనుమతి ఇచ్చి, ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అడ్డుకొన్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సభ జరిపి తీరుతామని చెబుతున్నారు. బీజేపీ శ్రేణులు బోరబండకు చేరుకోవాలని పిలుపునివ్వడం గమనార్హం. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని బీజేపీ లీడర్లు గుర్తుచేశారు.

News November 6, 2025

HYD: చీమలకు భయపడి వివాహిత సూసైడ్

image

చీమలకు భయపడి వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) ఫోబియా‌తో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్‌(35)‌ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.