News June 24, 2024
బి.కొత్తకోట: చేపల వేటకు వెళ్లి రైతు మృతి

ఆలేటి వాగుకు చేపల వేటకు వెళ్లి రైతు మృతి చెందాడని బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ తెలిపారు. పీటీఎం మండలం, రాపూరివాండ్లపల్లె గ్రామం, ఉప్పరవాండ్లపల్లెకు చెందిన రైతు ఎస్.నాగరాజ(50)శనివారం చేపలవేటకు బి.కొత్తకోట మండలంలోని ఆలేటివాగుకు వెళ్లాడు. చేపలు వేటాడుతుండగా పొర పాటున వాగులోపడి మృతి చెందాడు. సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా వెలికితీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 3, 2026
చిత్తూరు: నేడు సెలవు

హోలీ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు మంగళవారం సెలవు ఇస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఎక్కడైనా పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అకడమిక్ క్యాలెండర్‌లో సెలవు దినంగా పేర్కొన్న బుధవారం (4వ తేదీ) సాధారణ పనిదినంగా ఉంటుందన్నారు.
News March 3, 2026
చిత్తూరు జిల్లాలో వారికి వారం రోజుల గడువు

గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, వివిధ క్లినిక్లకు చిత్తూరు DMHO సుధారాణి కీలక సూచనలు చేశారు. APMCE చట్టం ప్రకారం అనుమతి పొందేలా వారం రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలనన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకా గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఫిజియోథెరపీ యూనిట్లు డీఎంహెచ్‌వో వద్ద రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 3, 2026
చిత్తూరు పోలీసులకు 54 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 54 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 23 ఫిర్యాదులు ఉన్నాయి. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.


