News June 24, 2024

స్నేహితుడితో గొడవపడి చెరువులో దూకి ఆత్మహత్య

image

మద్యం తాగే క్రమంలో స్నేహితుడితో గొడవపడి చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేకున్నాడు. ఈ ఘటన చేగుంట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాలు.. చేగుంటకు చెందిన తిరుపతి, సాయికుమార్(21) ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ స్నేహితుడిపై దాడి చేశాడు. ఆ క్రమంలో స్నేహితుడు గాయడగా భయపడిన సాయికుమార్ స్థానిక ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేకున్నాడు. మృతుడి తలిదండ్రులు గతంలోనే మృతి చెందారు.

Similar News

News November 8, 2025

మెదక్‌లో 5,857 ఇందిరమ్మ ఇళ్ల పనులు షురూ

image

మెదక్ జిల్లాలో మంజూరైన 9,181 ఇందిరమ్మ ఇళ్లలో 5,857 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. ఇంకా 3,324 ఇళ్ల పనులు మొదలుకాలేదన్నారు. ఇప్పటివరకు వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు రూ. 45 కోట్లు చెల్లించినట్లు వివరించారు. 400 అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్న లబ్ధిదారులుపై అంతస్తులో కూడా ఇల్లు నిర్మించుకోవచ్చని ఆయన సూచించారు. బేస్‌మెంట్, స్లాబ్ స్థాయిలో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

News November 7, 2025

మెదక్ పోలీస్ మైదానంలో వందేమాతరం గీతాలాపన

image

మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వందేమాతరం సామూహిక గీతాలాపన ఘనంగా నిర్వహించారు. ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బందితో పాటు మెదక్ టౌన్, రూరల్, హవేలిఘనపూర్ పోలీసులు పాల్గొన్నారు. బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ఈ దేశభక్తి గీతానికి నేటికి 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా కార్యక్రమాన్ని చేపట్టామని ఎస్పీ తెలిపారు.

News November 7, 2025

మెదక్: చిల్డ్రన్ హోంలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

మెదక్ చిల్డ్రన్ హోమ్ (బాలికల)లో పొరుగు సేవల పద్ధతిలో సేవిక, నైట్ వాచ్ ఉమెన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఈ నెల 25వ తేదీలోపు మెదక్ కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆమె సూచించారు.