News June 24, 2024
గన్నవరం చేరుకున్న నిర్మాతలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సమావేశం కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన నిర్మాతలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవాడ క్యాంప్ ఆఫీస్‌లో మరి కాసేపట్లో ఆయన్ను కలవనున్నారు. వీరిలో అల్లు అరవింద్, సురేశ్ బాబు, అశ్వినీదత్, ఎర్నేని నవీన్, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ తదితరులున్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పవన్‌తో చర్చించి పరిష్కారం కనుగొంటామని నిర్మాత అశ్వినీదత్ వెల్లడించారు.
Similar News
News September 18, 2025
ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరిగే ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.
News September 18, 2025
కోళ్లలో రక్తపారుడు వ్యాధి – లక్షణాలు

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు <<17696499>>లిట్టరు<<>>ను పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.
News September 18, 2025
OFFICIAL: ‘కల్కి-2’ నుంచి దీపికా పదుకొణె ఔట్

రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీలో కీలక పాత్రలో నటించిన దీపికా పదుకొణె రాబోయే సీక్వెల్‌లో నటించబోరని మేకర్స్ ప్రకటించారు. ‘కల్కి-2లో దీపిక భాగం కాదని ప్రకటిస్తున్నాం. అన్నివిధాలుగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. కల్కిలాంటి సినిమాలో నటించే నటులకు ఎక్కువ కమిట్మెంట్ అవసరం. దీపిక తదుపరి సినిమాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది.