News June 24, 2024

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల సమావేశం

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం ప్రారంభమైంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్‌కి నివేదించనున్నారు.

Similar News

News September 15, 2025

మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.

News September 14, 2025

కృష్ణాజిల్లా టుడే టాప్ న్యూస్

image

☞ మచిలీపట్నం ఎంపీకి మూడవ ర్యాంక్
☞ జగన్ ఓ డ్రామాల కింగ్: ఎంపీ
☞ గన్నవరం విమానాశ్రయంలో కనకదుర్గమ్మ దివ్య దర్శనం
☞ మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ
☞ కృష్ణాజిల్లా ఎస్పీ నేపథ్యం ఇదే.!  
☞ గన్నవరం ఎయిర్పోర్ట్ బోర్డు విషయంలో ఎమ్మెల్యే అసంతృప్తి
☞ గన్నవరం: హాస్టల్ వంట మనిషిపై విద్యార్థుల దాడి

News September 14, 2025

మచీలీపట్నం ఎంపీకి మూడవ ర్యాంక్

image

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో మచీలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి మూడవ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 72 ప్రశ్నలు అడగటంతో పాటు 18 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 79.41%గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.