News June 24, 2024

చాగల్లు రిజర్వాయర్‌లో మరో మృతదేహం లభ్యం

image

పెద్దపప్పూరు మండలం చాగల్లు డ్యామ్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉదయం మహిళ నజయా మృతదేహం లభ్యం కాగా.. తాజాగా మరో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి కాలనీకి చెందిన మహబూబ్ బాషాగా పోలీసులు గుర్తించారు. వీరు ఇద్దరు మరిది, వదినలని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 3, 2025

పెడపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద సోమవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ రంగాను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వారిని ఢీ కొన్న కారు ధర్మవరం వైపు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 3, 2025

పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 105 పిటిషన్లు: ఎస్పీ

image

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

News November 3, 2025

తరచూ బాలల సంరక్షణా కేంద్రాలను తనిఖీ చేయాలి: జేసీ

image

జిల్లాలో ప్రస్తుతం ఉన్న బాలల సంరక్షణా కేంద్రాలను సంబంధిత శాఖ అధికారులు తనిఖీ చేయాలని జేసీ శివ్ నారాయణన్ శర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి సిఫారసు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్‌పర్సన్ రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాలల సంరక్షణా కేంద్రాలలో బాలలకు సక్రమంగా పౌష్టిక ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు.