News June 24, 2024

అసంపూర్తిగా చర్చలు.. జూడాల సమ్మె కొనసాగింపు

image

TG: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయని జూనియర్ డాక్టర్లు తెలిపారు. కొన్ని అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా మరికొన్నింటిపై మరోసారి చర్చించాలని నిర్ణయించామన్నారు. స్టైఫండ్ గ్రీన్ ఛానల్‌పై మరోసారి చర్చించి నిర్ణయిస్తామన్నారు. వైద్యుల భద్రతపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. దీంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News January 2, 2025

సాగు చట్టాలను దొడ్డిదారిన తెచ్చే ప్రయత్నం: కేజ్రీవాల్

image

గతంలో ర‌ద్దు చేసిన సాగు చ‌ట్టాల‌నే కేంద్రం ‘విధానాల’ పేరుతో దొడ్డిదారిన అమలు చేయ‌డానికి సిద్ధ‌మవుతోంద‌ని కేజ్రీవాల్ ఆరోపించారు. మూడేళ్ల క్రితం రైతులకు ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. హామీల సాధ‌న‌కు ఉద్య‌మించిన పంజాబ్ రైతుల‌కు ఏదైనా జ‌రిగితే ఎన్డీయే ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. రైతుల‌తో మాట్లాడ‌క‌పోవ‌డానికి బీజేపీకి ఎందుకంత అహంకారం అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

News January 2, 2025

ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిశోర్

image

బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష‌ల్ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిశోర్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగారు. ప‌ట్నాలోని గాంధీ మైదాన్‌లో దీక్ష‌ ప్రారంభించిన PK మ‌రోసారి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. పోస్టుల్ని అమ్మ‌కానికి పెట్టిన అధికారులపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. Dec 13న జ‌రిగిన 70వ BPSC ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాలు జ‌రిగాయంటూ అభ్య‌ర్థులు ఆందోళనకు దిగారు.

News January 2, 2025

2 ఎకరాలతో రూ.931 కోట్లు ఎలా?: రోజా

image

AP: చంద్రబాబు దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలవడంపై మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ‘ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం సుమారు రూ.1,000 కోట్లతో దేశంలో అత్యంత ఆస్తి కలిగిన సీఎంగా చంద్రబాబు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా 2 ఎకరాల ఆసామి కొడుకు అయిన చంద్రబాబు రూ.931 కోట్లు ఎలా సంపాదించారు?’ అని ట్వీట్ చేశారు.