News June 24, 2024
పాకాల చెరువులో చేపల వేటకు దిగిన వ్యక్తిపై మొసలి దాడి

చెరువులో చేపల వేటకు దిగిన వ్యక్తిపై మొసలి దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో జరిగింది. గ్రామానికి చెందిన మురళి పాకాల చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మొసలి అతడిపై దాడి చేసింది. ఈ ఘటనలో మురళికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మురళి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Similar News
News January 20, 2026
గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్ కుమార్‌తో కలిసి అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
News January 20, 2026
వరంగల్: ‘ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి’

వరంగల్ జిల్లాలోని దివ్యాంగులకు వివిధ సహాయ ఉపకరణాల మంజూరుకు అర్హత కలిగిన వారు ఈనెల 30వ తేదీలోగా https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి బి.రాజమణి తెలిపారు. అర్హత గల వారికి బ్యాటరీ వీల్ ఛైర్లు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్, హైబ్రిడ్ వీల్ చైర్లు, ల్యాప్‌టాప్‌లు (డిగ్రీ విద్యార్థులకు), ట్యాబులు మంజూరు చేసి అందిస్తామన్నారు.
News January 19, 2026
వరంగల్: మహిళలకు సురక్షిత పని వాతావరణం కల్పించాలి: కలెక్టర్

పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘పోష్’ యాక్ట్-2013పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి కార్యాలయంలో చట్టాన్ని పక్కాగా అమలు చేసి, గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొని మహిళా సాధికారతపై దిశానిర్దేశం చేశారు.


