News June 24, 2024
గుడ్‌న్యూస్.. మళ్లీ పట్టాలెక్కనున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్

విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా రద్దు చేసిన పలు రైళ్లలో కొన్నింటిని పునరుద్ధరించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 25 నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్(విశాఖ-లింగంపల్లి) అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. దీంతో పాటు VJA- కాకినాడ పోర్టు, చెంగల్పట్టు- కాకినాడ పోర్టు మధ్య నడిచే రైళ్లను పునరుద్ధరించినట్లు పేర్కొంది. అలాగే పలు స్పెషల్ రైళ్లను మరికొన్నాళ్లు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
Similar News
News September 19, 2025
CM రేవంత్ ఇవాళ్టి ఢిల్లీ షెడ్యూల్

ఢిల్లీ: CM రేవంత్ ఉ.11గం.కు తాజ్ ప్యాలెస్‌లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి.మర్ఫీతో సమావేశమవుతారు. ఉ.11:30గం.కు బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే 12వ వార్షిక ఫోరమ్‌లో ప్రసంగిస్తారు. మ.12గం.కు అమెజాన్, కార్ల్స్ బర్గ్, గోద్రెజ్, ఉబర్ కంపెనీల ప్రతినిధులను పెట్టుబడులపై కలుస్తారు. మ.12:30గం.కు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు, నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జ్ బ్రెండేతో ప్రత్యేక భేటీ ఉంటుంది.
News September 19, 2025
భారత్-చైనాని ట్రంప్ భయపెట్టలేరు: రష్యా మంత్రి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బెదిరింపులు భారత్-చైనాలను భయపెట్టలేకపోయాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ వ్యాఖ్యానించారు. ‘నాకు నచ్చనిది చేయకండి టారిఫ్స్ విధిస్తాను అన్న ధోరణి ప్రాచీన నాగరికత కలిగిన భారత్, చైనా విషయంలో పనిచేయదు. అమెరికాకు అది అర్థమవుతోంది. సుంకాలు వేస్తే ఆ దేశాలను ఇంధనం, మార్కెట్ వంటి రంగాల్లో ఆల్టర్నేటివ్స్ వైపు మళ్లిస్తాయి’ అని తెలిపారు.
News September 19, 2025
Bigg Boss: ఆ ముగ్గురు డేంజర్ జోన్‌లో!

ఈ వారం నామినేషన్స్‌లో సుమన్ శెట్టి, పవన్, ప్రియ, భరణి, ఫ్లోరా, మనీశ్, హరీశ్ ఉన్నారు. ఈ ఏడుగురిలో సుమన్ శెట్టి ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హరీశ్, ఫ్లోరా కూడా మంచి పొజిషన్‌లోనే ఉండొచ్చు. కానీ మనీశ్, పవన్, ప్రియ డేంజర్ జోన్‌లో ఉండే ప్రమాదం ఎక్కువ కనిపిస్తోంది. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని రివ్యూవర్స్ ప్రిడిక్ట్ చేస్తున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? కామెంట్ చేయండి.