News June 24, 2024
జనసేన పార్టీ వినూత్న నిర్ణయం

AP: పాలనలో తన మార్క్ చూపించేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ పార్టీ మంత్రులకు కేటాయించిన శాఖలపై ప్రజల నుంచి వినూత్నంగా సలహాలు స్వీకరించాలని నిర్ణయించింది. ‘మీలో ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వాలంటే ఈ లింక్ ద్వారా <
Similar News
News November 4, 2025
160 సీట్లకు పైనే గెలుస్తాం: అమిత్ షా

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. 160కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ సమాన సీట్లు సాధిస్తాయని అన్నారు. గత 11 ఏళ్లలో రోడ్లు, బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్లు వంటి అతి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
News November 4, 2025
AP న్యూస్ అప్‌డేట్స్

✦ రైతులకు YCP ఏం చేసిందో అసెంబ్లీలో చర్చిద్దామా? జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్
✦ నకిలీ మద్యం కేసులో ఏడుగురిని కస్టడీకి ఇచ్చిన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు.. ఈ నెల 7 నుంచి 11 వరకు నిందితులను ప్రశ్నించనున్న పోలీసులు
✦ మద్యం కేసు నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 7కు వాయిదా వేసిన విజయవాడ ACB కోర్టు.. కౌంటర్ వేయాలని సిట్‌కు ఆదేశం
News November 4, 2025
పాక్ ప్లేయర్ హరీస్ రవూఫ్‌పై ఐసీసీ వేటు

ఆసియా కప్‌లో కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన ఆటగాళ్లపై ICC చర్యలు తీసుకుంది. పాక్ ప్లేయర్ హరీస్ రవూఫ్‌పై 2 మ్యాచుల బ్యాన్ విధించింది. 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్లు తెచ్చుకున్నందుకు ఈ వేటు వేసింది. 2 మ్యాచుల్లో 30% చొప్పున ఫీజులో కోత పెట్టింది. మరో ఆటగాడు ఫర్హాన్‌కు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. ఇక <<17831364>>సూర్య<<>>కు మ్యాచ్ (14వ తేదీ) ఫీజులో 30% కోత, 2 డీమెరిట్ పాయింట్లను విధించింది.


