News June 24, 2024

ఏపీలో ప్రభాస్ కల్కి మూవీ టికెట్ రేట్ల పెంపు

image

AP: ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి- 2898AD’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ <<13492922>>ప్రభుత్వం<<>> అనుమతినిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2వారాల పాటు సింగిల్ స్క్రీన్‌లలో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.125 మేర పెంచుకోవచ్చంది. అలాగే రోజుకు ఐదు షోలు వేసేందుకు కూడా అనుమతిచ్చింది. కాగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను పెంచింది. ఈ నెల 27న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Similar News

News April 19, 2026

మెళియాపుట్టి: భర్త చితికి నిప్పుపెట్టిన భార్య

image

ఇంటి యజమాని మృతి చెందిన బాధను దిగమింగుతూ భార్య, భర్తకు తలకొరివి పెట్టిన ఘటన మెళియాపుట్టి(మ) చాపరలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు..చాపరలో నివసిస్తున్న కృష్ణ(52) పెట్రోల్ బంక్‌లో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం బారిన పడగా..శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశాడు. పిల్లలు చిన్నవారు కాగా..భర్త మరణంతో కన్నీరుమున్నీరువుతూ ఆయన చితికి భార్య నిప్పుపెట్టింది.

News April 19, 2026

‘జైలర్-2’కు రికార్డ్ బ్రేకింగ్ OTT డీల్?

image

రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వస్తున్న ‘జైలర్ 2’ అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా ₹160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ధర లభించడం ఇదే తొలిసారి. మొదటి పార్ట్ కంటే రెట్టింపు ధరకు డీల్ కుదరడం విశేషం. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ యాక్షన్ డ్రామాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.

News April 19, 2026

అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి?

image

అక్షయ తృతీయ (నేడు) పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన రోజని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన చేసే స్నానం, జపం, హోమం, దానాలు ‘అక్షయ’మైన (తరగని) ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, నవధాన్యాలు దానం చేయడం విశేషమైన పుణ్యమని తెలుపుతున్నారు. ముఖ్యంగా నీటి కుండను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.