News June 24, 2024
HYD: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు కాపాడారు. పర్వత్ నగర్లో నివాసం ఉండే సాయికిరణ్(23) క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఆర్థిక ఇబ్బందులు తాళలేక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న మాదాపూర్ పోలీసులు గమనించి సాయి కిరణ్‌ను కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.
Similar News
News January 15, 2025
జార్జ్ రెడ్డి: ఈ పేరు HYDలో యాదుంటది!
‘జీనా హై తో మర్నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో ’ అంటూ నినాదించిన జార్జ్ రెడ్డి పేరు ఎప్పటికీ యాదుంటది. మన HYDతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 1947, JAN 15న జార్జ్ జన్మించారు. 1962లో ఆయన ఫ్యామిలీ HYDలో స్థిరపడింది. నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన జార్జ్ OUలో పీజీ చేశారు. వర్సిటీలోనే PDS (PDSU)ను స్థాపించి ఉద్యమాలు నడిపారు. గిట్టనివారు 1972-APR-14న ఉస్మానియా యూనివర్సిటీలోనే హత్యచేశారు. నేడు జార్జ్ జయంతి.
News January 15, 2025
త్వరలో OUలో ఇంజినీరింగ్ కోర్సులు
ఉన్నత విద్యా మండలి, అఖిలభారత సాంకేతిక విద్యా మండలి ఆమోదంతో త్వరలో ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు అందుబాటులోకి తీసుకురానున్నామని ఓయూ అధికారులు తెలిపారు. ఉపాధి కల్పన, క్యాంపస్ ప్లేస్మెంట్లు కల్పించేలా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు డిగ్రీ కోర్సుల్లో ఇంజినీరింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యాసంస్థల తరహాలో పాఠ్యాంశాలను రూపొందించనున్నాయి.
News January 15, 2025
HYD: నుమాయిష్‌లో పోలీసుల బందోబస్తు
HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నుమాయిష్‌కు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్‌కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజూ ముగ్గురు ఏసీపీలు, 9 మంది ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ బృందాలతో బందోబస్తు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.