News June 24, 2024
అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదు: పోలీసులు

TG: హైదరాబాద్‌లో రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారని వస్తున్న వార్తలపై నగర పోలీసులు స్పందించారు. ‘సోషల్ మీడియాలో సిటీ పోలీసులు రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి. దుకాణాలు, సంస్థలు తెరిచే మరియు మూసివేసే సమయాలు ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగుతాయి. ఇది అందరూ గమనించగలరు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 12, 2025
TG, AP న్యూస్ రౌండప్

✦ DEC 20 నాటికి మేడారం అభివృద్ధి పనులు పూర్తి: మంత్రి పొంగులేటి
✦ రాష్ట్రంలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు.. నిబంధనలు ఉల్లంఘించే వెహికల్స్‌కు భారీ ఫైన్: మంత్రి పొన్నం
✦ DEC 3 నుంచి అందుబాటులోకి TG SET హాల్ టికెట్లు
✦ విజయవాడలో 249kgs గంజాయి పట్టుకున్న ఈగల్ టీమ్
✦ ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో నలుగురు నిందితులకు ఈ నెల 25 వరకు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు
News November 12, 2025
రాజమౌళి-మహేశ్ బాబు మూవీ.. ప్రియాంక పోస్టర్ రిలీజ్

రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో హీరోయిన్ ప్రియాంకా చోప్రా పాత్రను పరిచయం చేస్తూ రాజమౌళి పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఆమె చీర ధరించి, చేతిలో గన్ పట్టుకుని అగ్రెసివ్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ప్రియాంక ‘మందాకిని’ పాత్రలో నటిస్తున్నారని జక్కన్న తెలిపారు. Welcome back, Desi Girl! అని ట్వీట్ చేశారు.
News November 12, 2025
టెర్రరిజంపై అమెరికా ద్వంద్వ నీతి.. మరోసారి బట్టబయలు!

టెర్రరిజం విషయంలో అమెరికా ద్వంద్వ నీతి మరోసారి బట్టబయలైంది. భారత్‌లో దాడులు జరిగితే ఒకలా, పాక్‌లో అయితే మరోలా స్పందించింది. ఎక్కడా టెర్రరిజం అనే పదం వాడకుండా ఢిల్లీ పేలుడుపై US ఎంబసీ ట్వీట్ చేసింది. అదీ ఘటన జరిగిన ఒకరోజు తర్వాత ఓ పోస్టుతో మమ అనిపించింది. పాక్‌లో దాడులు జరిగితే మాత్రం వెంటనే స్పందించి మొసలి కన్నీరు కార్చింది. టెర్రరిజంపై పోరులో పాకిస్థాన్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లు ట్వీట్ చేసింది.


