News June 25, 2024
సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 206 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 181/7కే పరిమితమైంది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (76) ఒంటరి పోరాటం చేశారు. మిచెల్ మార్ష్ (37) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.
Similar News
News April 10, 2026
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా?

కొత్త దుస్తులను ఉతకకుండా ధరించడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వీటి తయారీలో వాడే రంగులు, ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలు, షోరూమ్‌లలో ఇతరులు ట్రయల్ వేయడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, వారి దుస్తులను కచ్చితంగా ఉతికిన తర్వాతే వేయాలి’ అని సూచిస్తున్నారు. SHARE IT
News April 10, 2026
ఇన్‌స్టాలో కొత్త ఫీచర్.. ఇక కామెంట్స్‌ను ఎడిట్ చేయొచ్చు!

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అప్‌డేట్ వచ్చింది. ఇకపై కామెంట్లలో తప్పులు దొర్లితే డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. కామెంట్ పోస్ట్ చేసిన 15 నిమిషాల్లోపు ఎన్నిసార్లైనా మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. కేవలం Textను మాత్రమే ఎడిట్ చేయొచ్చు. ఫొటోలు లేదా స్టిక్కర్లను మార్చడం కుదరదు. మనం ఎడిట్ చేసినట్లు ఇతరులకు కనిపిస్తుంది. కానీ, పాత కామెంట్ ఏంటో వారికి తెలియదు.
News April 10, 2026
బుల్ జోరు.. స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 275 పాయింట్లు లాభపడి 24,050 వద్ద, సెన్సెక్స్ 918 పాయింట్లు ఎగసి 77,550 వద్ద క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్‌లో ఏషియన్ పెయింట్స్, ICICI, M&M, SBI, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో, HCLటెక్, టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫీ, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి.


