News June 25, 2024

లోకేశ్‌ను కలసిన నెల్లూరు టీచర్లు

image

విద్యా శాఖా మంత్రిగా నారా లోకేశ్ అమరావతిలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను నెల్లూరు జిల్లా బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు కలసి అభినందించారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 1, 2024

NLR: నేటి నుంచి బాదుడే బాదుడు

image

దేశ వ్యాప్తంగా జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద సోమవారం నుంచి పెంచిన రుసుము వసూళ్లు చేస్తారు. నెల్లూరు జిల్లా పరిధిలో వెంకటాచలం, కావలి, బూదనం టోల్ గేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో వాహనాల నుంచి అదనంగా రూ.15 వరకు వసూళ్లు చేస్తారు. ఈ మేరకు వాహనదారులు తమ ఫాస్టాగ్‌లో నగదు నిల్వలు సరిచూసుకోవాలని టోల్ గేట్ల నిర్వాహకులు చూస్తున్నారు.

News June 30, 2024

రేపటి నుంచి నూతన నేర చట్టాలు అమలు: నెల్లూరు ఎస్పీ

image

జూలై ఒకటో తేదీ నుంచి దేశంలో నూతన నేర చట్టాలు అమలులోకి వస్తున్నాయని జిల్లా ఎస్పీ కే.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష అధినియమ్ చట్టాలుగా మారయన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చట్టాలపై అవగాహన ఉండాలన్నారు.

News June 30, 2024

సబ్ స్టేషన్లలో అందుబాటులో ఉండాలి: SE

image

నెల్లూరు సర్కిల్ పరిధిలో వినియోగదారులకు మరింత మెరుగ్గా కరెంట్ సరఫరా అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని APSPDCL ఎస్ఈ విజయన్ వెల్లడించారు. ఇందులో భాగంగానే ‘పీక్ హవర్స్‌లో సబ్ స్టేషన్ల తనిఖీ’ అనే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఆయా సబ్ స్టేషన్లలో అధికారులు అందుబాటులో ఉండి కరెంట్ సరఫరాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.