News June 25, 2024
బోధన్: రద్దు చేసిన రైళ్లను వెంటనే పునరుద్ధరించాలని వినతి

రద్దు చేసిన బోధన్ మహబూబ్ నగర్ ప్యాసింజర్ రైల్, బోధన్ కరీంనగర్ రైళ్లను వెంటనే పునరుద్ధరించాలని విద్యార్థి జేఏసీ బోధన్ స్టేషన్ మాస్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిజామాబాద్ నుంచి నడిచే నిజామాబాద్ కాచిగూడ ప్యాసింజర్ రైలు బోధన్ నుంచి ప్రారంభించాలని, బోధన్ నుంచి ప్రారంభమయ్యే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బోధన్ స్టేషన్లో టికెట్టు ఇవ్వాలని కోరారు.
Similar News
News September 14, 2025
NZB: STU ఏడు మండలాల కార్యవర్గ సభ్యుల ఎన్నిక

నిజామాబాద్ జిల్లాలో స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) ఏడు మండలాల కార్యవర్గ సభ్యులను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎడపల్లి మండల అధ్యక్షుడిగా యూసుఫ్, ప్రధాన కార్యదర్శిగా భూపతి ఎన్నికయ్యారు. నవీపేట అధ్యక్షుడిగా రవీందర్, ప్రధాన కార్యదర్శిగా గణేష్ ఎంపికయ్యారు. అదే విధంగా నిజామాబాద్ నార్త్, సౌత్, డిచ్‌పల్లి, ఆలూరు, మోపాల్ మండలాల నూతన అధ్యక్ష, కార్యదర్శులను కూడా ఎన్నుకున్నారు.
News September 14, 2025
జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ జరిగిందని NZB CP సాయి చైతన్య జాతీయ మెగా లోక అదాలత్ లో భాగంగా వివిధ కేసులలో రాజీ పడి పరిష్కారం అయినందునకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం దక్కిందని, సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.42,45,273-00ను సైతం తిరిగి సైబర్ బాధితులకు అందజేసినట్లు వివరించారు. జిల్లాను అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.