News June 25, 2024
ఏఐ టెక్నాలజీతో సిద్ధమవుతోన్న UPSC

పరీక్షల ప్రక్రియను పటిష్ఠపర్చేలా ఫేషియల్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత CCTVలతో పర్యవేక్షణ వ్యవస్థను UPSC రూపొందించుకోనుంది. పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు ఆఫ్‌లైన్‌కి వెళ్లినా, అనుమానాస్పద కదలికలున్నా, సమయం దాటి ఇన్విజిలేటర్ అక్కడే ఉన్నా ఈ సిస్టమ్ అధికారుల్ని అలర్ట్ చేస్తుంది. సివిల్ సర్వీసెస్ IFSలతో సహా 14కీలక పరీక్షల్ని UPSC నిర్వహిస్తోంది. ఏటా దాదాపు 26లక్షల మంది పోటీ పడుతుంటారు.
Similar News
News April 7, 2026
జైలర్-2 కోసం షారుఖ్ 5 రోజుల షూటింగ్?

నెల్సన్ డైరెక్షన్‌లో రజినీకాంత్ నటిస్తున్న జైలర్-2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన చిత్రీకరణలో మోహన్ లాల్ తన పార్ట్‌ను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా క్యామియో రోల్ చేయనున్నారు. ఇందుకు 5 రోజులు డేట్స్ ఇచ్చారని, త్వరలోనే షూటింగ్ జరగనుందని సమాచారం. ఇది HYDలోనా, మరో సిటీలోనా అనేది త్వరలో క్లారిటీ రానుంది.
News April 7, 2026
పంజాబీ నటితో అర్ష్‌దీప్ డేటింగ్? ఫొటో వైరల్!

స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తాజాగా షేర్ చేసిన ఒక స్నాప్‌చాట్ ఫొటో హాట్ టాపిక్‌గా మారింది. దాంట్లో అర్ష్‌దీప్ ఒకమ్మాయి చేయి పట్టుకొని ఉండగా నెటిజన్లు ఆమె పంజాబీ నటి సమ్రీన్ కౌర్ అని అంటున్నారు. ఆమె చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. IPL 2026 మ్యాచుల్లో సమ్రీన్ పంజాబ్ జెర్సీలో కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. వీరిద్దరూ తమ రిలేషన్‌పై ఇప్పటివరకు స్పందించలేదు.
News April 7, 2026
అపస్మారక స్థితిలో ఇరాన్ సుప్రీం లీడర్!

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆచూకీపై తొలిసారి కీలక సమాచారం బయటకు వచ్చింది. ఆయన ఇరాన్‌లోని ఖోమ్ నగరంలో అపస్మారక స్థితిలో చికిత్స తీసుకుంటున్నారని అమెరికా, ఇజ్రాయెల్ గూఢచారులు గల్ఫ్ దేశాలకు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్నారట. కాగా FEB 28 దాడుల్లో అలీ ఖమేనీ చనిపోగా, మొజ్తబా గాయపడ్డారు. షియా ముస్లింలకు పవిత్రంగా భావించే ఖోమ్‌లో అలీ అంత్యక్రియలు జరిగాయి.


