News June 25, 2024
EMERGENCY: ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ!

దేశ చరిత్రలోనే ఈ రోజు ఒక బ్లాక్ డే. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇందుకు కారణాలేమైనా దేశంలో పూర్తిగా స్వేచ్ఛ లేకుండా పోయింది. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను అరెస్ట్‌లు చేసి జైళ్లలో పెట్టారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రాథమిక హక్కులను పూర్తిగా కాలరాశారు. పత్రికలపై సెన్సార్ విధించారు. దాదాపు రెండేళ్ల తర్వాత 1977 మార్చి 21న అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు.
Similar News
News March 14, 2025
వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
News March 14, 2025
జనసేన ఆవిర్భావ దినోత్సవం.. అంబటి సెటైర్

AP: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని సెటైర్ వేశారు.
News March 14, 2025
WPL: ఈ సారైనా కప్పు కొట్టేనా?

WPL 2025లో కప్పు కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడనున్నాయి. మూడో సారి ఫైనల్ చేరిన DC జట్టు ఈ సారైనా కప్పు కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు MI రెండోసారి ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ఎదురుచూస్తోంది. అయితే ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముంబైపై ఢిల్లీదే పైచేయి కావడం ఆ జట్టుకు సానుకూలంగా ఉంది. మరి రేపు జరిగే తుది పోరులో DC ఇదే జోరు కొనసాగిస్తుందో డీలా పడుతుందో చూడాలి.