News June 25, 2024
BNGR: కుటుంబ కలహాలతో యువకుడు సూసైడ్

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామానికి చెందిన మహేష్ వ్యవసాయ కూలీల పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన మహేష్ తన వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొర్రెల కాపరులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News January 11, 2026
NLG: లక్ష్యానికి దూరంగా.. మీనం..!

నల్గొండ జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియపై మత్స్యకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం ముగిసినా నిర్దేశిత లక్ష్యంలో 80 శాతం పూర్తికాకపోవడం గమనార్హం. జూలైలోనే జలాశయాలు నిండినా, నిధుల విడుదల ఆలస్యమవడంతో పంపిణీలో జాప్యం జరిగింది. ప్రభుత్వం స్పందించి మిగిలిన కోటాను పూర్తి చేయడంతో పాటు, నాణ్యమైన చేప పిల్లలను అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
News January 11, 2026
నల్గొండ: ఏసీబీలో ‘లీక్’ వీరులు..!

అవినీతి తిమింగలాలను పట్టించాల్సిన ACBలోనే కొందరు ‘లీకు వీరులు’ తయారవ్వడం కలకలం రేపుతోంది. దాడులు నిర్వహించాల్సిన సిబ్బందే, సదరు అవినీతి అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తూ వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నల్గొండ ఏసీబీ విభాగంలో పనిచేస్తున్న ఓ CI, హోంగార్డు కలిసి ఈ దందాను నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ మొదలైనట్లు తెలుస్తోంది.
News January 11, 2026
రైతు భరోసా… ఇంకెంతకాలం నిరీక్షణ!

రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం జిల్లాలోని రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదార్ రైతులు ఉండగా యాసంగి సీజన్‌పై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది జనవరి 26నే ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కాగా.. ఈసారి నవంబర్‌లో సీజన్ ప్రారంభమై ఈ నెలాఖరుకు ముగుస్తున్నా నిధుల ఊసే లేదు. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.


