News June 25, 2024

ATP: వివాహేతర సంబంధంతోనే ఆత్మహత్య

image

అనంత జిల్లా పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు జలాశయంలోకి దూకి ఓ జంట నిన్న ఆత్మహత్య చేసుకోగా దీనికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు. గుత్తి మండలానికి చెందిన నిజామా(35) తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికి చెందిన మరిది మహబూబ్‌బాషా(26)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆందోళనకు గురైన వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గౌస్‌బాషా తెలిపారు.

Similar News

News March 14, 2025

ముదిగుబ్బ: కూతురిని తీసుకొచ్చేందుకు వెళ్లి గుండెపోటుతో మృతి

image

విజయవాడలో ఇంటర్ చదువుతున్న కూతురిని పరీక్షల అనంతరం తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ తండ్రి గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. ముదిగుబ్బకు చెందిన శ్రీనివాసరెడ్డి కూతురు విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఆఖరి పరీక్ష అనంతరం ఇంటికి తీసుకొచ్చేందుకు భార్యతో కలిసి వెళ్లాడు. కూతురిని పరీక్షకు పంపి వారు షాపింగ్ చేస్తుండగా ఛాతీలో నొప్పితో కుప్పకూలి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News March 14, 2025

JNTUA: ఎంటెక్ ఫలితాల విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎంటెక్ 1వ, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కె.మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.

News March 14, 2025

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్

image

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్ ఎంపికయ్యారు. గుత్తి మండలం బేతపల్లికి చెందిన వైసీపీ నేతలు సూర్యనారాయణ, ఈశ్వరయ్య, తదితరులు మల్లయ్య యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ముందుగా మల్లయ్యను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి సన్మానించారు. రైతుల సమస్యల పట్ల పోరాడుతానన్నారు. తనను ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!