News June 25, 2024

ATP: జెడ్పీ ఉద్యోగికి గుండెపోటు.. భార్య ఒడిలోనే తుదిశ్వాస

image

అనంతపురం జిల్లా పరిషత్ ఉద్యోగి మల్లికార్జున మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. బత్తలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఆయన.. గుండె పట్టుకున్నట్లు ఉందంటూ భార్యకు చెప్పారు. ఇంతలోనే భార్య ఒడిలోనే తుదిశ్వాస వదిలారు.

Similar News

News March 3, 2026

అనంత: జాగ్రత్త.. ఇది డేంజర్ స్పాట్

image

కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి వద్ద హైవే మలుపు డేంజర్ స్పాట్‌గా మారింది. ఇటీవల అక్కడ వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 15 రోజుల క్రితం 2 బైకులు డీకొన్న ఘటనలో ఒకరు మరణించారు. నెల రోజుల క్రితం అక్కడే ట్రాక్టర్, కారు డీకొన్నాయి. మలుపు ప్రమాదకరంగా మారడంతోనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

News March 2, 2026

ఇంటర్ ఫస్టియర్ గణితం పరీక్షలకు 408 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గణితం పరీక్ష జరిగింది. పరీక్షలకు సెట్-1 ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయుడు తెలిపారు. జనరల్ విద్యార్థులు 13,890 గాను 13,621 మంది హాజరు కాగా 269 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్ విద్యార్థులు 2,258 గాను 2,119 మంది హాజరు కాగా 139 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

News March 2, 2026

ఉగాది నాటికి 16,702 ఇళ్ల పూర్తి లక్ష్యం సాధించాలి: జేసీ

image

అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఉగాది నాటికి జిల్లాకు కేటాయించిన 16,702 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద మంజూరైన ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఏ బిల్లుల అప్లోడ్, స్వామిత్వం, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు.