News June 25, 2024

కడప జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే.?

image

టీచర్ ఉద్యోగం కలల స్వప్నాన్ని ప్రభుత్వం సాకారం చేసేందుకు సిద్ధమైంది. మెగా DSC నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి కడప జిల్లాలో 298 ఎస్టీటీలతో కలిపి మొత్తం 709 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించనున్నారు.

Similar News

News July 1, 2024

కేసుల పరిష్కారంలో కడప జిల్లాకు రెండో ర్యాంకు

image

జూన్ 29వ తేదీన ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 22 బెంచుల్లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 2367 కేసులను పరిష్కరించారు. ఇందులో క్రిమినల్ కేసులు 2036, సివిల్ కేసులు 217, ఫ్రీ లిటిగేషన్ కేసులు 114 పరిష్కారమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసుల పరిష్కారంలో జిల్లా రెండవ ర్యాంకులో నిలిచింది.

News July 1, 2024

చింతకొమ్మదిన్నె: పెళ్లికి తీసుకెళ్లలేదని ఆత్మహత్య

image

మండలంలోని అంగడివీధికి చెందిన ఓ బాలిక (16) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పెద్దముడియం మండలానికి చెందిన బాలిక అంగడివీధిలోని తన పిన్ని ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. కుటుంబ సభ్యులు తనని పెళ్లికి తీసుకువెళ్లలేదని మనస్తాపంతో అధిక మోతాదులో మాత్రలు మింగి అస్వస్థకు గురి కావడంతో, ఏలూరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News July 1, 2024

ప్రొద్దుటూరు: అసలే మైనర్.. ఆపై ముగ్గురితో డ్రైవింగ్

image

మైనర్ బాలుడి వయసు 12 ఏళ్లు. మరో ముగ్గురిని స్కూటీలో కూర్చోపెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. నలుగురు పిల్లలు గాంధీ రోడ్డులో స్కూటీలో వెళ్తున్న దృశ్యం ఆదివారం ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ కంట పడి వారిని ప్రశ్నించారు. దుకాణానికి వచ్చినట్లు పిల్లలు తెలిపారు. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను హెచ్చరించినట్లు డీఎస్పీ తెలిపారు.