News June 25, 2024

HYD: వైన్స్ మూసివేయాలని డిమాండ్

image

అంబర్‌పేటలోని రఘునాథ్‌నగర్‌లోని ఓ వైన్ షాప్ వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూం ఏర్పాటు చేయడంతో పాటు టేబుల్స్, కుర్చీలు వేసి జనతా బార్లుగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ వైన్ పర్మిట్ రూమ్ నుంచి శబ్దాలతో‌ ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ధూమపానం, మందుబాబుల మూత్ర విసర్జనతో దుర్వాసన వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News July 1, 2024

HYD: బోనాల పండుగ.. MLA రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

image

ఈనెలలో బోనాల ఉత్సవాల నేపథ్యంలో హిందూ ప్రజలను ఉద్దేశించి HYD గోషామహల్ MLA రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బోనాల ఉత్సవాల్లో ఎట్టి పరిస్థితుల్లో హలాల్ జరగడానికి వీలు లేకుండా చూడాలన్నారు. మేకను, గొర్రెను బలిచ్చేటప్పుడు హలాల్ చేయనీయొద్దని, హిందూ పద్ధతిలోనే చేయాలన్నారు. ఒకవేళ బలిచ్చే వారు ముస్లిం అయితే అతడు తన మనసులోనైనా సరే ఆ గొర్రెను అల్లాకు సమర్పిస్తున్నానని చెబుతాడని ఆయన ఆరోపించారు.

News July 1, 2024

రాచకొండ పరిధిలో విస్తరించనున్న కూడళ్లు ఇవే..!

image

ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో చక్రిపురం వైజంక్షన్, ఎన్ఎఫ్ కూడలి, కుషాయిగూడ ఠాణా సమీపంలోని రమాదేవి ఆస్పత్రి కూడలి, ఏఎస్ రావునగర్, అశోక్ నగర్, కెనరా బ్యాంకు కూడలి, నేతాజీనగర్, హెబ్‌బీ కాలనీ ఎక్స్ రోడ్డు, తల్లూరి కూడలి, కుషాయిగూడ డీమార్ట్ కూడలి, శారద చౌరస్తా, ఉప్పల్ ఎక్స్ రోడ్డు, చిలుకానగర్, వీటీ కమాన్ తదితర కూడళ్లు ఉన్నాయి.

News July 1, 2024

సైబరాబాద్ పరిధిలో విస్తరించనున్న కూడళ్లు ఇవే..!

image

ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆరాంఘర్ చౌరస్తా, పీడీపీ కూడలి, దుర్గానగర్ కూడలి, పిల్లర్ నంబర్ 294 కూడలి, పిల్లర్ నంబర్ 202, బన్సీలాల్‌నగర్, ట్రిపుల్ ఐటీ కూడలి, శేరిలింగంపల్లి గుల్మొహర్ కూడలి, కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసు, ఖాజాగూడ, రాడిసన్ డీఎల్ఎఫ్, ఆల్విన్ కాలనీ, మియాపూర్, ఖానామెట్, గూడెన్మెట్ చౌరస్తా తదితర కూడళ్లు ఉన్నాయి.