News June 25, 2024
శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో మంగళవారం ఉదయం భానుడు తన ప్రతాపం చూపడంతో ప్రజలు ఉక్క పోతతో అల్లాడారు. మధ్యాహ్నం ఎట్టకేలకు ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకుంటూ భారీ వర్షం కురవడంతో ఆయా ప్రాంత ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ఇటు పల్లపు ప్రాంత రైతులు ఈ వర్షం వరి నాట్లు వేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తపరిచారు.
Similar News
News July 6, 2025
ఎండాడ వద్ద రోడ్డు ప్రమాదం.. బూర్జ మండల వాసి మృతి

ఎండాడ వద్ద RTC బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో శ్రీకాకుళం(D) బూర్జ(M) ఉప్పినివలసకు చెందిన వెంకటరమణమూర్తి(45) మృతి చెందాడు. PMపాలెం CI బాలకృష్ణ వివరాల ప్రకారం.. రమణమూర్తి భార్య, పిల్లలతో కలిసి విశాఖలో ఉంటున్నాడు. శనివారం RDO ఆఫీసుకి వెంకట్రావుతో కలిసి రమణమూర్తి శ్రీకాకుళం వెళ్లారు. తిరిగి వస్తుండగా ఎండాడ వద్ద బస్సును ఓవర్‌టేక్ చేసే సమయంలో ప్రమాదం జరిగి రమణమూర్తి చనిపోగా వెంకట్రావు గాయపడ్డాడు.
News July 6, 2025
శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీకి చెందిన పడాల. నారాయణ రావు(84) శనివారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలియజేశారు. డాక్టర్ కె.సుదీర్ పర్యవేక్షణలో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ సుజాత, చిన్ని కృష్ణ ద్వారా అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నం ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.
News July 6, 2025
శ్రీకాకుళం: ఈ నెల 10న మెగా టీచర్ పేరెంట్ మీటింగ్

మెగా టీచర్ పేరెంట్ మీటింగ్‌ను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ, జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 10న మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని వారికి సూచించారు. కలెక్టర్ చాంబర్‌లో శనివారం ఆయా శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు ఉన్నారు.