News June 25, 2024

ప్రజాస్వామ్యం షరతులతో నడవదు: రామ్మోహన్

image

స్పీకర్ ఎన్నికకు విపక్షాలు షరతులు విధించడం సరికాదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యం షరతులతో నడవదని, ఇలాంటి సంప్రదాయం మునుపెన్నడూ లేదని ఆయన విమర్శించారు. స్పీకర్ పదవికి సహకరించాలని, డిప్యూటీ స్పీకర్ పదవి అంశం చర్చకు వచ్చినప్పుడు మాట్లాడదామని రాజ్‌నాథ్ సింగ్ కోరినా విపక్షాలు వినడంలేదని ఆయన చెప్పారు.

Similar News

News October 10, 2024

రూ.10వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు..

image

రతన్‌జీ 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎప్పుడూ దేశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. బాధ్యతలు స్వీకరించిన సమయంలో కంపెనీ రెవెన్యూ రూ.10వేల కోట్లుగా ఉంది. తర్వాత అంతర్జాతీయ స్థాయిలో టాటా గ్రూపును విస్తరించారు. స్టీల్, ఆటో మొబైల్ వంటి రంగాల్లో విస్తృతపరిచారు. కంపెనీ బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూ చేపట్టిన సంస్కరణలతో పదవి నుంచి దిగిపోయే సరికి రెవెన్యూను రూ.లక్ష కోట్లకు చేర్చారు.

News October 10, 2024

సంక్షోభ సమయంలో నేనున్నాంటూ..

image

భారత్‌ను వణికించిన ఘటనల్లో ముంబై ఉగ్రదాడి ఒకటి. టాటా గ్రూపునకు చెందిన తాజ్ హోటల్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో హోటల్ ధ్వంసమైంది. అయినప్పటికీ రతన్ టాటా ముందుండి మరింత దృఢంగా పునర్నిర్మించారు. దాడిలో గాయపడ్డ బాధితులతో పాటు హోటల్ సిబ్బందికి అండగా నిలిచి భరోసానిచ్చారు. కరోనా సమయంలోనూ తన వంతు సాయంగా రూ.1,500 కోట్ల భారీ విరాళం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు.

News October 10, 2024

ఈనెల 13 నుంచి రాష్ట్రపతి ఆఫ్రికా పర్యటన

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 13 నుంచి ఆఫ్రికాలోని అల్జీరియా, మౌరిటానియా, మలావిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేస్తారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. రాష్ట్రపతి పర్యటన భారత్-ఆఫ్రికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని వెల్లడించింది. పర్యటనలో భాగంగా ముర్ము ఆఫ్రికాలోని ప్రవాస భారతీయులను కలవనున్నారు.