News June 25, 2024

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రాష్ట్ర మంత్రులు

image

ఢిల్లీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. తెలంగాణ బిడ్డ కేంద్ర మంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా పార్టీలకు అతీతంగా సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సత్కరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రిని వారు కోరారు.

Similar News

News July 1, 2024

NLG: ఇక క్యూఆర్ కోడ్ తోనే చెల్లింపులు!

image

మీ-సేవా కేంద్రాల్లో రెవెన్యూ పరమైన సేవలన్నింటికీ నగదు రహిత చెల్లింపులను తప్పని సరి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 1 నుంచి ఈ నూతన విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాలిస్తుండటంతో ఇక మీదట ప్రైవేటు కేంద్రాల్లోనూ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా రుసుం వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News July 1, 2024

NLG: జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు

image

నల్గొండ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వర్షాకాలం షురూ కాకముందే  డెంగీ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదు కావడం డెంగీ వ్యాప్తి ఉధృతికి అద్దం పడుతోంది. నల్గొండ నియోజకవర్గంలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

News July 1, 2024

ముమ్మరంగా వానాకాలం పంటల నమోదు ప్రక్రియ

image

ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాలకు వద్దకు వెళ్లి సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. కొన్నిచోట్ల సర్వర్ సమస్యలు తలెత్తినా నమోదు చేయాలని సర్కార్ ఆదేశించింది. ఆగస్టు నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని గడవు విధించింది. ఈ మేరకు ప్రస్తుతం పత్తి, కంది, జీలుగ, వరి తదితర పంటల లెక్క తేల్చుతున్నారు.