News June 25, 2024

తాడేపల్లిగూడెం: గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

image

తాడేపల్లిగూడెంలో ఆదివారం గల్లంతయిన బాలుడి మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. మణికంఠ అనే బాలుడు సెలూన్ షాపుకు వెళ్లి యాగర్లపల్లి ఏలూరు కాలువలో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన బాలుడి కోసం ఎన్.డి.ఆర్.ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం తాడేపల్లిగూడెంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మణికంఠ మృతదేహం గుర్తించారు.

Similar News

News July 1, 2024

ఏలూరు: పింఛన్ నిరాకరించిన మహిళ

image

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో పింఛన్ల ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కాగా గ్రామానికి చెందిన సూర్యదేవర పద్మావతి అనే మహిళకు కూటమి నాయకులు రూ.7వేల పింఛన్ అందించారు. కాగా ఆమె తీసుకున్న పింఛన్‌కు రూ.3 వేలు కలిపి మొత్తం రూ.10వేలను తిరిగి కూటమి నాయకులకు ఇచ్చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు సాయంగా ఈ నగదు అందిస్తున్నట్లు ఆమె తెలిపింది.

News July 1, 2024

కాళ్లు కడిగి పింఛన్ అందించిన మంత్రి నిమ్మల

image

ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ క్రమంలో వృద్ధుల కాళ్లు కడిగి పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. ఇక ప్రతి నెల పెరిగిన పింఛన్ లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు.

News July 1, 2024

వైసీపీ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టుకు దెబ్బ: MP

image

వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు దెబ్బతిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ ఆరోపించారు. 2014కు ముందు ప్రాజెక్టు పనులు కేవలం 5 శాతం మాత్రమే జరగ్గా.. 2014- 2019 మధ్య టీడీపీ హయాంలో 68 శాతం పనులు జరిగాయన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 3.8 శాతం పనులను మాత్రమే చేయగలిగిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును సందర్శించి.. పనులను గాడిలో పెడుతుందని చెప్పారు.