News June 25, 2024

కేజ్రీవాల్‌కు షాక్

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై రికార్డులను పరిశీలించకుండా ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిందని వ్యాఖ్యానించింది. దీంతో లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం తిహార్ జైలులోనే ఉండనున్నారు.

Similar News

News July 10, 2025

యూరియా అధికంగా వాడితే?

image

యూరియా కొరత నేపథ్యంలో దాన్ని సరఫరా చేస్తామంటూనే వాడకం తగ్గించుకోవాలని కేంద్రం సూచిస్తోంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. పంట ఏపుగా పెరిగేందుకు యూరియాను అధికంగా వాడితే భూసారం తగ్గడంతో పాటు భవిష్యత్తులో దిగుబడులు తగ్గి పెట్టుబడులు పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యూరియా నుంచి వెలువడే అమ్మోనియాతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

News July 10, 2025

ఇవాళే ‘గురు పౌర్ణమి’.. ఎవరిని పూజించాలంటే?

image

ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. వ్యాస మహర్షి జన్మదినాన్నే గురు పౌర్ణమిగా పిలుస్తారని పండితులు చెబుతున్నారు. గురువును పూజిస్తే తనని పూజించినట్లేనని స్వయంగా వ్యాస మహర్షే చెప్పారట. అందుకే గురు పౌర్ణమికి దక్షిణామూర్తి, దత్తాత్రేయ, రాఘవేంద్రస్వామి, సాయిబాబాని పూజించాలని జ్యోతిషులు చెబుతున్నారు. అలాగే ‘వ్యాం, వేదవ్యాసాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తే పూజా ఫలితం దక్కుతుందట.

News July 10, 2025

4 ట్రిలియన్ డాలర్లు.. ప్రపంచంలో తొలి కంపెనీగా Nvidia రికార్డు

image

అమెరికాకు చెందిన చిప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ Nvidia అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఈ సంస్థ మార్కెట్ విలువ నిన్న 4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలో ఈ మార్కును అందుకున్న తొలి కంపెనీగా నిలిచింది. ఇది ఫ్రాన్స్, బ్రిటన్ GDP కంటే ఎక్కువ కావడం విశేషం. జూన్ 2023లో దీని మార్కెట్ విలువ తొలిసారి 1 ట్రిలియన్ డాలర్లను తాకింది. AIకి డిమాండ్ పెరుగుతుండటంతో ఈ కంపెనీ షేర్లు దూసుకెళ్తున్నాయి.