News June 25, 2024

BREAKING: AP TET ఫలితాలు విడుదల

image

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 27-మార్చి 6 వరకు జరిగిన ఈ పరీక్షలో దాదాపు 2.3లక్షల మంది హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 14న విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ వల్ల అది సాధ్యపడలేదు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News January 2, 2026

శబరిమల బంగారం చోరీ.. CBI దర్యాప్తు అవసరం లేదు: కేరళ CM

image

శబరిమల బంగారం చోరీ కేసులో CBI దర్యాప్తు డిమాండ్లను కేరళ CM విజయన్ తోసిపుచ్చారు. SIT దర్యాప్తు సంతృప్తికరంగా జరుగుతోందన్నారు. సాక్ష్యాల ఆధారంగా ఎవరినైనా విచారణకు పిలవచ్చన్నారు. ఈ కేసులో అరెస్టై జైలులో ఉన్న ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, మరో జ్యువెలర్, కాంగ్రెస్ ఎంపీలు అదూర్ ప్రకాశ్, ఆంటోని కట్టుదిట్టమైన భద్రతలో ఉండే కాంగ్రెస్ అగ్రనేత సోనియాతో సన్నిహితంగా ఉండటంపై అనుమానం వ్యక్తం చేశారు.

News January 1, 2026

విషపు నీళ్లు!

image

దాహం తీర్చాల్సిన నీళ్లే విషమై ప్రాణం తీసిన <<18729199>>ఘటన<<>> యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. MP ఇండోర్‌లో నీళ్లు కలుషితమై 6 నెలల పసికందు సహా 10 మంది మరణించడం వెనుక యంత్రాంగం నిర్లక్ష్యం కళ్లకు కడుతోంది. తాగునీటి పైప్‌లైన్‌లో మురికినీరు ఎక్కడ కలుస్తుందో మున్సిపల్ అధికారులు ఇప్పటికీ కనుక్కోలేకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనం. 10 రోజులైనా బాధిత ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించలేని దౌర్భాగ్యం.

News January 1, 2026

టెంపో డ్రైవర్ టు శంఖ్ ఎయిర్‌లైన్స్ ఓనర్..

image

UP కాన్పూర్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన శ్రవణ్ కుమార్ విశ్వకర్మ నేడు శంఖ్ ఎయిర్‌లైన్స్‌కు ఓనర్‌ అయ్యారు. టెంపో నడుపుతూ చిన్న వ్యాపారాలు చేసి నష్టపోయిన శ్రవణ్.. 2014లో సిమెంట్ ట్రేడింగ్‌లో సక్సెస్ కావడంతో మైనింగ్, ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌లోకి దిగారు. భారత్‌లో ప్రారంభం కానున్న 4 కొత్త ఎయిర్‌లైన్స్‌లో శంఖ్ ఒకటి. సామాన్యులు విమానాల్లో ప్రయాణించేలా చేయడమే లక్ష్యమని చెబుతున్నారు శ్రవణ్.