News June 25, 2024

అక్రమ రవాణాపై కఠిన చర్యలు: ఎస్పీ

image

ఇసుక, గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుని కట్టడి చేయాలని సెబ్ అధికారులకు తిరుపతి ఎస్పీ విష్ణువర్ధన్ రాజు సూచించారు. జిల్లా సెబ్ అధికారులతో పోలీసు గెస్ట్ హౌస్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అందరూ పనితీరును మెరుగుపరచుకోవాలని ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచి ఎక్కడికక్కడ కట్టడి చేయాలన్నారు.

Similar News

News December 21, 2024

జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పెద్దిరెడ్డి 

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. శనివారం బెంగళూరులోని జగన్ నివాసానికి చేరకున్న పెద్దిరెడ్డి బొకే అందించి సన్మానించారు. తమ నాయకుడు ఇలాంటి వేడుకలు మరెన్నో చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. కాగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జగన్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ కార్యకర్తలు వైభవంగా నిర్వహిస్తున్నారు.

News December 21, 2024

రామసముద్రం: హౌసింగ్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

image

రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీలోని హౌసింగ్ లేఔట్ ను శనివారం హౌసింగ్ డిఈ రమేష్ రెడ్డి, ఎంపీడీవో భానుప్రసాద్ పరిశీలించారు. పెండింగులో ఉన్న గృహనిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని డీఈ సూచించారు. పునాదులు, గోడల వరకు ఉన్న ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసినట్లయితే వెంటనే బిల్లులు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు.

News December 21, 2024

కుప్పానికి రూ.451 కోట్లు.. జీవో ఇచ్చి మళ్లీ రద్దు

image

CM చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అభివృద్ధికి ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్ కింద రూ.456 కోట్లు మంజూరు చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. కుప్పం పరిధిలో 130 KM మేర అండర్ డ్రైనేజ్‌, 11 అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించాలని ఆదేశించింది. నిన్న రాత్రే ఈ జీవోను రద్దు చేసింది. పనుల్లో కొన్ని మార్పులు చేసి మరోసారి జీవో ఇస్తారని సమాచారం.