News June 25, 2024
సజ్జల రామకృష్ణారెడ్డిపై CIDకి ఫిర్యాదు

AP: YCP ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై CIDకి ఫిర్యాదు అందింది. దౌర్జన్యం చేసి గనులు దోచేశారని నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బద్రీనాథ్ CID DSPకి ఫిర్యాదు చేశారు. ‘సైదాపురం(మ) జోగుపల్లిలో మాకు 240 ఎకరాలు ఉంది. అక్కడ 8 గనులు ఉన్నాయి. రెండేళ్లుగా మా గనులను అక్రమంగా దోచారు. రూ.వేల కోట్లు దోచుకున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారు’ అని బద్రీనాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News February 4, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News February 4, 2026
భారత GDP వృద్ధి 6.9%: గోల్డ్‌మన్ శాక్స్

ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం, భారత వస్తువులపై USA టారిఫ్‌ల తగ్గింపుతో.. పలు రేటింగ్ సంస్థలు మనదేశ వృద్ధి అంచనాలను సవరిస్తున్నాయి. ఈ ఏడాది భారత GDP వృద్ధిని 6.9 శాతంగా గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఇరుదేశాల వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే తక్కువ సుంకాలు అమలై, దేశ GDPలో సుమారు 0.2% వృద్ధి కనిపిస్తుందని వెల్లడించింది. వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గి ఆర్థిక పరిస్థితులకు మద్దతు లభిస్తుందని పేర్కొంది.
News February 4, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 04, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.37 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


