News June 25, 2024

ఆదిలాబాద్ : మొత్తం 248 మంది వెరిఫికేషన్ పూర్తి

image

పాలిసెట్ మొదటి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ 3వ రోజు మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో 3 రోజుల పాటు జరిగింది. కాగా మంగళవారం 47 మంది అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోగా 47 మంది అభ్యర్థులు హాజరైనట్లు పాలిసెట్ కోఆర్డినేటర్ భరద్వాజ తెలిపారు. మూడురోజుల పాటు జరిగిన కౌన్సెలింగ్‌లో మొత్తం 248 మంది వెరిఫికేషన్ పూర్తయినట్లు తెలిపారు.

Similar News

News July 1, 2024

పోలీసులు అనుమతి తప్పనిసరి: నిర్మల్ ఎస్పీ

image

నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా 30 పోలీస్ యాక్ట్‌ను సోమవారం నుంచి అమలుచేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈనెల 31 వరకు జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సమావేశాలు, సభలు ,ర్యాలీలు నిర్వహించవద్దని శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 1, 2024

భైంసా: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ
కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో రాజనీతిశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఉర్దూ మాధ్యమంలో ఉర్దూ-1, రాజనీతిశాస్త్రం, చరిత్ర, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

News July 1, 2024

కాగజ్‌నగర్: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

image

వెనుకబడిన ప్రాంతాలకు విద్య, వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభోత్సవం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏది నెరవేర్చలేదని ప్రజలు గుర్తించాలన్నారు.