News June 25, 2024

IND vs ENG: సెమీఫైనల్‌కు వరుణ గండం?

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈనెల 27న జరిగే సెమీఫైనల్‌లో ఇండియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. కాగా మ్యాచ్ జరిగే రోజు గయానాలో భారీ వర్షం కురవనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు 89 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా ఒకవేళ మ్యాచ్ రద్దయితే గ్రూప్-1లో టాప్ ప్లేస్‌లో ఉన్న టీమ్ ఇండియా ఫైనల్‌కు వెళ్తుంది. రిజర్వ్ డే లేకపోవడం భారత్‌కు కలిసిరానుంది.

Similar News

News November 3, 2025

దీప్తీ శర్మ రికార్డుల మోత

image

ఉమెన్స్ వరల్డ్ కప్: ఫైనల్లోనే కాదు.. టోర్నమెంట్ మొత్తం దీప్తీ శర్మ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచారు. WC నాకౌట్‌లో 58 రన్స్, 5 వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌(మెన్స్+ఉమెన్స్)గా చరిత్ర సృష్టించారు. ఉమెన్స్ WC ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు(22) తీసిన మూడో ప్లేయర్‌గా, ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో 200+ రన్స్, 20+ వికెట్స్ తీసిన తొలి ప్లేయర్‌గా దీప్తి చరిత్ర సృష్టించారు.

News November 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 3, 2025

శభాష్.. షెఫాలీ!

image

వైల్డ్ కార్డ్‌ ఎంట్రీతో తన వైల్డ్ పర్ఫామెన్స్‌తో టీమిండియా కప్పు కొట్టడంలో కీలకపాత్ర పోషించిన షెఫాలీ వర్మ క్రికెట్ జర్నీ అంత సాఫీగా సాగలేదు. క్రికెట్ అకాడమీలో చేరేటప్పుడు అమ్మాయి అని తనను ఎవరూ చేర్చుకోలేదు. దీంతో జుట్టు కత్తిరించుకొని అబ్బాయిలా మారి వాళ్లతో ఆడారు. అందుకోసం రోజూ 16KM సైకిల్‌పై వెళ్లేవారు. తన ప్రతిభతో జట్టులో చోటు సంపాదించి, జట్టుకు తొలి WC ట్రోఫీ అందించిన ఆమె జర్నీ స్ఫూర్తిదాయకం.