News June 25, 2024

రాజధాని కోసం డ్వాక్రా మహిళల రూ.4.50 కోట్ల విరాళం

image

AP: అమరావతి నిర్మాణం కోసం చిత్తూరు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు రూ.4.5 కోట్ల భారీ విరాళాన్ని సేకరించారు. ఆ చెక్కును సీఎం చంద్రబాబుకు ఈరోజు అందజేశారు. పాతికేళ్ల క్రితం డ్వాక్రా మహిళల కోసం చంద్రబాబు వేసిన విత్తనమే నేడు మహావృ‌క్షమై లక్షలాది కుటుంబాలను ఆదుకుంటోందని ఈ సందర్భంగా కొనియాడారు. ఆ విశ్వాసంతోనే అమరావతి నిర్మాణం కోసం ఉడతాభక్తిగా విరాళాన్ని కలెక్ట్ చేసి అందజేశామని వారు వెల్లడించారు.

Similar News

News October 10, 2024

Stock Markets: భారీ లాభాల వైపు..

image

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినప్పటికీ హెవీవెయిట్స్ అండతో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. BSE సెన్సెక్స్ 81,780 (+310), NSE నిఫ్టీ 25,072 (+90) వద్ద కొనసాగుతున్నాయి. పవర్‌గ్రిడ్, NTPC, కొటక్ బ్యాంక్, M&M, ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్స్. అదానీ ఎంటర్‌ప్రైజెస్, సిప్లా, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ టాప్ లూజర్స్.

News October 10, 2024

RATAN TATA: ‘ఏత్ బార్’ నిర్మాత కూడా

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతితో బాలీవుడ్ కూడా మూగబోయింది. ఆయన నిర్మించిన సినిమాను కొందరు గుర్తు చేసుకుంటున్నారు. 2004లో ‘ఏత్ బార్’ అనే చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. విక్రమ్ భట్ రూపొందించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రలు పోషించారు. హాలీవుడ్ మూవీ ‘ఫియర్’ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత టాటా మళ్లీ సినిమాల వైపు తొంగి చూడలేదు.

News October 10, 2024

కశ్మీర్ లోయలో కమ్యూనిస్ట్ వీరుడు

image

జమ్మూ కశ్మీర్‌లో కమ్యూనిస్టుల కోటగా నిలుస్తూ వస్తోంది కుల్గాం నియోజకవర్గం. ఇందుకు కారణం యూసఫ్ తరిగామి. 1996 నుంచి ఇక్కడ CPM జెండాను రెపరెపలాడిస్తున్నారు. 18 ఏళ్ల వయస్సులో ఆయన విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్పటి నుంచి కశ్మీర్ ప్రయోజనాల కోసం తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాజా ఎన్నికల్లో నిషేధిత జమాతే ఇస్లామి బలపర్చిన అభ్యర్థితో తలపడ్డారు. అభివృద్ధి అజెండాతో మరోసారి విజయ దుందుభి మోగించారు.