News June 25, 2024

నియోజకవర్గాల్లో జనవాణి చేపట్టాలి: పవన్

image

AP: ఎన్నికలకు ముందు జనసేన నిర్వహించిన జనవాణి విజయవంతమైందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘MLAలు కూడా నియోజకవర్గాల్లో ప్రతి నెలా జనవాణి చేపట్టాలి. ఎంపీలు, MLAలు నియోజవర్గ స్థాయిలో అభినందన కార్యక్రమాలు చేపట్టాలి. మీ గెలుపు కోసం తోడ్పడిన కూటమి నాయకులు, పార్టీ నాయకులను అభినందించాలి. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసిన జనసైనికులు, వీరమహిళలను గుర్తించండి’ అని MLAలను ఆదేశించారు.

Similar News

News October 10, 2024

నాలుక కోసుకుని దుర్గామాతకు సమర్పించిన భక్తుడు!

image

దుర్గామాతపై భక్తిని చాటుకునేందుకు ఓ వ్యక్తి అవాంఛిత చర్యకు పూనుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లా లాహర్ నగర్‌లో రతన్‌గఢ్ దేవీ ఉత్సవాల్లో రామ్ శరణ్ పాల్గొన్నాడు. అనంతరం తన నాలుకను తెగ్గోసుకుని అమ్మవారికి సమర్పించి, రక్తాన్ని అక్కడి పాత్రలో పోశాడు. ఇది చూసిన స్థానికులంతా నివ్వెరపోయారు. ఈ ఘటన తర్వాత రామ్ కాసేపు ఆలయంలోనే నిద్రించి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
– ఎవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు.

News October 10, 2024

రేపు ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ

image

రితీశ్ రాణా దర్శకత్వంలో సింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం రేపు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ‘మత్తు వదలరా’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

News October 10, 2024

ఇప్పటివరకు రతన్ టాటా ఇచ్చిన విరాళాలు ఎన్ని వేల కోట్లో తెలుసా?

image

రతన్ టాటా కలియుగ దానకర్ణుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతరులపై జాలి, దయ చూపండంటూ చెప్పే రతన్ టాటా ఆ మాటలకు ఆజన్మాంతం కట్టుబడి ఉన్నారు. టాటా గ్రూప్ లాభాల్లో 60-65శాతం నిధులను సామాజిక బాధ్యత కింద ఖర్చు చేస్తున్నారు. దేశంలో విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, ప్రజాసంక్షేమ కార్యక్రమాల కోసం ఆయన ఇప్పటివరకు రూ.9వేల కోట్లు విరాళంగా ఇచ్చారు.