News June 25, 2024

టాలీవుడ్ స్టోరీస్ C/O ఉత్తరాంధ్ర

image

ఉత్తరాంధ్రలో జరిగిన యధార్థ సంఘటనలే కథలుగా వెండితెరపై అలరిస్తున్నాయి. ఇటీవల పలాస, జయమ్మ పంచాయతీ, కోటబొమ్మాళి లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. తాజాగా..పాకిస్థాన్ జైలులో చిక్కుకున్న సిక్కోలు మత్స్యకారుడి స్టోరీలో నాగచైతన్య-సాయి పల్లవి నటిస్తున్నారు. రామ్‌చరణ్-బుచ్చిబాబు సినిమాకు కోడి రామ్మూర్తి జీవిత చరిత్రే ఆధారమని టాక్. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News September 15, 2025

విశాఖ పీజీఆర్ఎస్‌కు 329 వినతులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని రెవెన్యూ అధికారి భవానీ శంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన ప్రజలు వినతులు స్వీకరించారు. వివిధ స‌మ‌స్య‌ల‌పై మొత్తం 329 విన‌తులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందిన‌వి 92, జీవీఎంసీకి చెందిన‌వి 88, పోలీసు శాఖ‌కు సంబంధించి 25, ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించి 124 ఉన్నాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేషశైలజ ఉన్నారు.

News September 15, 2025

పెద్ద గంట్యాడలో ఉచిత శిక్షణ

image

ఏపీ ప్రభుత్వం స్థాపించిన నేక్ ఆధ్వర్యంలో బ్రాడ్ బాండ్ టెక్నీషియన్ కోర్స్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సోమవారం తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి 18-40 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులన్నారు. 3 నెలల శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి కల్పిస్తారన్నారు. పెద్ద గంట్యాడ నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని తెలిపారు.

News September 15, 2025

విశాఖలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ

image

విశాఖ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీపీ సీఐ మురళి, వెస్ట్‌ జోన్‌ క్రైమ్‌ సీఐ శ్రీనివాసరావులను విశాఖ రేంజ్‌కు సరెండర్‌ చేశారు. ఎంవీపీ లా అండ్‌ ఆర్డర్‌ సీఐగా ప్రసాద్, వెస్ట్‌ జోన్‌ క్రైమ్‌కు చంద్రమౌళి, ద్వారకా ట్రాఫిక్‌కు ప్రభాకరరావు, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సిటీ వీఆర్‌లో ఉన్న భాస్కరరావును నియమించారు.