News June 25, 2024
ఈసారి వరల్డ్ కప్ టీమ్ ఇండియాదే: అక్తర్

టీ20 వరల్డ్ కప్ గెలిచేందుకు వందకు వంద శాతం అర్హత టీమ్ ఇండియాకే ఉందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నారు. ఈ సారి భారత్ ఖచ్చితంగా గెలవాలని ఆయన కోరారు. ‘వన్డే వరల్డ్ కప్‌లోనే రోహిత్ శర్మ ట్రోఫీ గెలవాల్సింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో భారత్ అధ్బుతంగా ఆడుతోంది. ఈసారి ఖచ్చితంగా ఆ జట్టే గెలవాలి. ఉపఖండంలోనే WC ట్రోఫీ ఉండాలి. ఇప్పుడు ట్రోఫీ గెలిచేందుకు రోహిత్ పూర్తిగా అర్హుడు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 18, 2026
ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

న్యూఢిల్లీలోని <
News February 18, 2026
ఫాల్గుణ మాసంలో ఇలా చేయండి: పండితులు

మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను భక్తితో కొలిస్తే శుభాలు కలుగుతాయని పండితుల మాట. ‘చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరొచ్చింది. అర్జునుడికి ‘ఫల్గుణుడు’ అనే పేరుండటం మరో ప్రత్యేకత. దానధర్మాలు చేయడం, పవిత్ర నదులలో స్నానమాచరించడం వల్ల పుణ్యం లభిస్తుంది. ప్రకృతి వసంతానికి సిద్ధమయ్యే ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతనతో గడపడం ఉత్తమం’ అంటున్నారు.
News February 18, 2026
మిరప మొక్కల వేర్లపై బొడిపెలకు కారణమేంటి?

మిరప పంటకు నులి పురుగులు ఆశించడం వల్ల మొక్కల వేర్లపై బొడిపెలు ఏర్పడతాయి. దీని వల్ల పంటకు నష్టం వాటిల్లుతుంది. ఈ నులి పురుగుల నివారణకు ఎకరాకు 100 కిలోల వేప పిండిని చల్లి, మట్టిలో కలిసే విధంగా నీరు పెట్టాలి. ఈ పురుగులు ఆశించిన పొలంలో వంగ, టమాటా, బంగాళాదుంపలను సాగు చేయకూడదు. ఆవాలు, నువ్వులు, మొక్కజొన్న, చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


