News June 26, 2024

కుప్పంలో కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

image

కుప్పం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కుప్పం డెవలప్మెంట్ అథారిటీ(కడా) ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కడా ఏర్పాటుతో పాటు దీనికి ఓ ఐఏఎస్ అధికారిని నియమిస్తామన్నారు. కుప్పం ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.

Similar News

News November 11, 2025

మౌలానాకు నివాళులు అర్పించిన ఎస్పీ

image

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం నివాళులు అర్పించారు. దేశ తొలి విద్యామంత్రిగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. నిరక్షరాస్యత పేదరికం రూపుమాపడానికి అనేక సేవలు చేశారని వెల్లడించారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శం అన్నారు.

News November 11, 2025

పూతలపట్టు: అదుపుతప్పి ఐచర్ వాహనం బోల్తా

image

పూతలపట్టు మండలం కొత్తకోట సమీపంలో గల జాతీయ రహదారిపై ఐచర్ వాహనం బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు వైపు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఐచర్ వాహనం అతివేగంగా వెళ్లి బోల్తా పడింది. ఇందులో ఉన్న దానిమ్మ కాయలు కోసం ప్రజలు ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి.

News November 11, 2025

చిత్తూరు: విస్తృతంగా పోలీసుల తనిఖీ

image

ఢిల్లీలో జరిగిన దాడుల నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా అంతటా అన్ని ముఖ్యమైన రహదారులు, చెక్‌పోస్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. లాడ్జిలు, హోటళ్లలో సైతం తనిఖీలు చేశారు. అనుమానితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.