News June 26, 2024
విడాకులు తీసుకోనున్న జయం రవి- ఆర్తి రవి?

ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆర్తి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి జయం రవితో ఉన్న అన్ని ఫొటోలను డిలీట్ చేయడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే, విడాకులపై వీరిద్దరూ ఇంకా స్పందించలేదు. ఈ ఏడాది ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన ధనుశ్- ఐశ్వర్య, జీవీ ప్రకాశ్- సైంధవి, ఇమ్మాన్ – మోనికలు విడాకులు ప్రకటించారు.
Similar News
News April 13, 2026
హౌసింగ్ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

అనంతపురం కలెక్టర్ ఆనంద్ హౌసింగ్ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పీఎంఏవై అర్బన్, గ్రామీణ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. ఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
News April 13, 2026
మహిళా క్రికెటర్లపై కాసుల వర్షం!

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ICC రికార్డు స్థాయిలో ₹82 కోట్ల ప్రైజ్ పూల్‌ను ప్రకటించింది. 2024తో పోలిస్తే ఇది 10% అధికం. విజేతగా నిలిచిన టీమ్‌కు ₹21.9 కోట్లు, రన్నరప్‌కు ₹10.9 కోట్లు దక్కనున్నాయి. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీసం ₹2.3 కోట్ల గ్యారంటీ ప్రైజ్ మనీ లభించనుంది. జూన్ 12 నుంచి 12 జట్లతో జరగనున్న ఈ మెగా టోర్నీలో మహిళా క్రికెటర్లపై కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.
News April 13, 2026
హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి: హైకోర్టు

TG: తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. ‘హైడ్రాకు ఇప్పటివరకు విధివిధానాలు లేవు. కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. చెరువులు, రోడ్లు, పార్కులు ఆక్రమిస్తే కూల్చివేయాలి. నోటీసులు ఇవ్వకుండా ఇష్టానుసారం కూల్చివేస్తున్నారు’ అని మండిపడింది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు అమీన్‌పూర్‌లో చేపట్టిన కూల్చివేతల వీడియోలను జడ్జికి సమర్పించారు.


