News June 26, 2024

ARCHER&JONES: చిన్ననాటి స్నేహితులు.. కానీ..!

image

ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్, యూఎస్ఏ ఆటగాడు ఆరోన్ జోన్స్ చిన్ననాటి స్నేహితులు. బార్బడోస్‌కు చెందిన వీరిద్దరూ స్కూల్ నుంచే ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి క్రికెట్ ఆడారు. వెస్టిండీస్‌ జట్టుకు ఆడాలని కలలు కన్నారు. కానీ విధి మరోలా తలిచింది. ఆ జట్టుకు ఇద్దరూ సెలక్ట్ కాలేదు. దీంతో ఆర్చర్ ఇంగ్లండ్‌కు, జోన్స్ అమెరికాకు వలస వెళ్లారు. తమ ఆట తీరుతో ఆయా జట్లకు ఎంపికై సత్తా చాటుతున్నారు.

Similar News

News April 17, 2026

యురేనియం ఇచ్చేందుకు ఇరాన్ ఒప్పుకుంది: ట్రంప్

image

శుద్ధి చేసిన యురేనియంను ఇచ్చేందుకు ఇరాన్ ఒప్పుకుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. 2 దేశాలు శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని తెలిపారు. ‘వాళ్లు మాకు న్యూక్లియర్ డస్ట్ ఇచ్చేందుకు ఓకే చెప్పారు. ఇరాన్‌తో విజయవంతమైన చర్చలు జరుగుతున్నాయి. డీల్ అయ్యాక స్వేచ్ఛగా చమురు లభిస్తుంది. హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది. ఇస్తామాబాద్‌లో ఒప్పందం జరిగితే నేను పాకిస్థాన్‌కు వెళ్తా’ అని విలేకరులతో అన్నారు.

News April 17, 2026

ఏప్రిల్ 17: చరిత్రలో ఈరోజు

image

1756: స్వాతంత్ర్య సమరయోధుడు ధీరన్ చిన్నమలై జననం
1897: ఆధ్యాత్మిక గురువు నిసర్గదత్తా మహారాజ్ జననం
1966: తమిళ హీరో విక్రమ్ జననం
1979: తమిళ హీరో సిద్ధార్థ్ జననం
1790: US సహ వ్యవస్థాపకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం
1975: భారత తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణం(ఫొటోలో)
2004: సినీ నటి సౌందర్య మరణం

News April 17, 2026

ఏప్రిల్ 17: చరిత్రలో ఈరోజు

image

1756: స్వాతంత్ర్య సమరయోధుడు ధీరన్ చిన్నమలై జననం
1897: ఆధ్యాత్మిక గురువు నిసర్గదత్తా మహారాజ్ జననం
1966: తమిళ హీరో విక్రమ్ జననం
1979: తమిళ హీరో సిద్ధార్థ్ జననం
1790: US సహ వ్యవస్థాపకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం
1975: భారత తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణం(ఫొటోలో)
2004: సినీ నటి సౌందర్య మరణం