News June 26, 2024

హైదరాబాద్‌: రాంగ్‌రూట్‌‌లో‌ వెళితే చిక్కినట్లే!

image

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాంగ్‌రూట్‌లో వెళితే ఇక ఉపేక్షించేది లేదని‌ హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ANPR(ఆటో మేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అడ్డదారిలో‌ వెళ్లిన వారి వాహనాలను గుర్తించి చలానాలు విధిస్తారు. IPC 336 సెక్షన్ కింద కేసు నమోదు చేయనున్నారు. SHARE IT

Similar News

News January 18, 2026

HYD: అందంగా ఉంటే సరిపోదు.. SKIP చేయకుంటేనే VIRAL..!

image

‘అందంగా ఉన్నంత మాత్రాన రీల్స్ వైరల్ కావు.. యూజర్ స్కిప్ చేయకుండా చూసినప్పుడే అల్గారిథమ్ గుర్తిస్తుంది’ అని క్రియేటర్‌వర్స్ ఫౌండర్ డా.మణి పవిత్ర పేర్కొన్నారు. FTCCI టూరిజం కమిటీ ఆధ్వర్యంలో శనివారం జూబ్లీహిల్స్‌లో టూరిజం రీల్స్ బూట్‌ క్యాంప్ నిర్వహించారు. తెలంగాణ టూరిజంను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో జరిగిన ఈ శిక్షణలో 58 మంది పాల్గొన్నారు. FTCCI ప్రతినిధులు పాల్గొన్నారు.

News January 18, 2026

HYD: డాక్టర్ల చీటీ వాళ్లకే అర్థమవుతుంది.. ఎందుకు..?

image

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ సామాన్యులకూ అర్థమయ్యేలా ఉండాలని NMC ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కాగా, డాక్టర్లు రాసే మందుల చీటీ మెడికల్ షాప్ సిబ్బందికి సులువుగా అర్థమవుతుంది. ఇందుకు ప్రధాన కారణం వారి పని అనుభవమే. రోజూ వందలాది ప్రిస్క్రిప్షన్లు చూసే ఫార్మసిస్టులు డాక్టర్ల చేతిరాత, మందుల అబ్రివేషన్లు, ఫార్ములాలను ఈజీగా గుర్తిస్తారు. మందులపై అవగాహన ఉండటంతో చీటీ చూడగానే టక్కున మాత్రలు ఇచ్చేస్తారు.

News January 18, 2026

హైదరాబాద్‌పై NTR చెరగని ముద్ర

image

HYDపై మాజీ CM దివంగత NTR చెదరని ముద్ర వేశారు. ట్యాంక్‌బండ్‌‌లో మనం చూసే బుద్ధ విగ్రహం ఆయన ఆలోచనలోనుంచే పుట్టింది. ఇందులో 1990 మార్చి 10న ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహ తొలి ప్రతిష్ఠ విషాదంగా మారింది. అనంతరం 1992లో విజయవంతంగా ప్రతిష్ఠించగా, నేడు అది HYDకు ప్రతీకగా నిలుస్తోంది. సాగరతీరం సౌందర్యవృద్ధికి 1996లో నెక్లెస్ రోడ్డును రూపుదిద్దారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా HYD ఆయనను స్మరిస్తోంది.