News June 26, 2024

నిజామాబాద్ GGHలో సూపర్ స్పెషాలిటీ సేవలు

image

నిజామాబాద్ GGHలో సూపర్ స్పెషాలిటీ సేవలు సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్ తెలిపారు. ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడంతో కామారెడ్డి, నిర్మల్, మహారాష్ట్ర నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో గుండె సంబందిత శస్త్ర చికిత్సలు, రొమ్ము క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, యూరాలజీతో పాటు న్యూరాలజీ సేవలు అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

Similar News

News July 1, 2024

NZB: కుటుంబ కలహాలతో వ్యక్తి సూసైడ్

image

భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో కలత చెంది ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందారు. ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపిన వివరాలు.. సిద్ధాపూర్ గ్రామానికి చెందిన సుద్ధపల్లి చంద్రన్న(47) వ్యక్తి కొంతకాలంగా నవీపేట మండలం జన్నేపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. కేసు, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

News July 1, 2024

కామారెడ్డి: టమాట రైతు ‘పంట’ పండింది

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ​మండలం కుప్రియాల్​లో టమాట రైతు పంట పడింది. గ్రామానికి చెందిన స్వరూప భూంరెడ్డి దంపతులు ఎకరం భూమిలో రెండు నెలల మల్చింగ్​పద్ధతిలో టమాట సాగు చేశారు. ప్రతి రోజు టమాటలను తెంపి 30కి పైగా బాక్సుల్లో కామారెడ్డి, HYDకు తరలిస్తున్నామని, ప్రస్తుతం కిలో టమాటా రూ.70 నుంచి రూ. 100 వరకు పలకడంతో.. రూ. 10 లక్షల లాభం ఉందని సదరు రైతు తెలిపారు.

News July 1, 2024

NZB: నేటి నుంచే కొత్త నేర చట్టాల అమలు

image

నేరాల సంఖ్య తగ్గించి బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు కొత్త నేర చట్టాలను జిల్లాలో నేటి నుంచి పోలీస్‌శాఖ అమలు చేయనుంది. అందుకోసం పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న 1040 మందికి కొత్త చట్టాలపై శిక్షణ ఇచ్చారు. మారిన కొత్త చట్టాల గురించి బాధితులకు వివరించడానికి జిల్లా లీగల్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేయనుంది.