News June 26, 2024

పాఠశాలలో చేరిన SAలు.. SGTల పదోన్నతులపై ఫోకస్

image

స్కూల్ అసిస్టెంట్ సమాన స్థాయి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగియడంతో అధికారులు ఎస్జీటీ సమాన స్థాయి ఉపాధ్యాయులకు SAలుగా పదోన్నతి కల్పించడంపై దృష్టి సారించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 1,734 మంది SAలు బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులు మంగళవారం కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరారు. పదోన్నతులు పొందనున్న SGTలు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు.

Similar News

News July 1, 2024

NGKL: ఆస్పత్రి నుంచి ఈశ్వరమ్మ డిశ్ఛార్జి

image

నాగర్‌కర్నూల్ జిల్లా మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మ పూర్తిగా కోలుకోవడంతో నిమ్స్ నుంచి డిశ్ఛార్జి చేశారు. కొందరి పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను గత నెల 23న నిమ్స్‌లో చేర్చారు. 8 రోజులు చికిత్స అనంతరం డిశ్ఛార్జి చేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఆమె వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి జూపల్లి రూ. లక్ష చెక్కును ఆమెకు అందజేశారు.

News July 1, 2024

NGKL: నేటి నుంచి అభయారణ్యంలో ప్లాస్టిక్ నిషేధం

image

అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమ్రాబాద్ అభయారణ్యంలో జూలై 1 నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు మన్ననూర్ ఎఫ్ఆర్ఓ ఈశ్వర్ తెలిపారు. పర్యావరణం పరిరక్షణ, వన్య ప్రాణుల వనగడను దృష్టిలో ఉంచుకొని అభయారణ్యంగా గుర్తించి ఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడరాదన్నారు. వాటర్ బాటిళ్లు, బిస్కెట్ కవర్లు, పాలిథిన్ కవర్లు పడేయవద్దని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు అన్నారు.

News July 1, 2024

MBNR: ఆరు తడి పంటలకు ప్రాణం !

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం కురిసింది. ఈ వర్షంతో ఆరుతడి పంటలైన పత్తి, జొన్న, మొక్క జొన్న, కంది పంటలకు ఊరట లభించింది. దాంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాల నుంచి వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో వర్షం పడకపోతే మొలకలు ఎండిపోయే ప్రమాదం ఉండగా.. ఈ వాన ఊపిరి పోసింది. ఈ వర్షంతో 15 రోజుల వరకు పంటలకు భరోసా దక్కినట్లేనని రైతులు అంటున్నారు.